పుట:ఉపదేశ రత్నములు మలయాళ స్వామి 1948.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

21

పదమును తీసివేసి పురుష పదమును కుదుర్చుటకై చాలాశ్రమజేసి చూచినను, వ్యాకరణము కుదుర లేదట. అందువలన పదము ముందు యుంచుట దైవాజ్ఞయని అట్లే యుంచినారట. గాన స్త్రీయే ముఖ్యమని ఎఱుంగవ లెను.

52. పుణ్యాత్ము లయొక్క మనస్సు, వాక్కు,తనువు, ధనము లన్నియు పుణ్యకార్యములకే ఉపయోగపడుచుండును. పాపా త్ములయొక్క తను, మన ధనములు పాపకార్యముల కే ఉపయోగ పడుచుండును. పుణ్యాత్ములమనస్సు ఎప్పుడును ప్రశాంతము గాను ఆనందముగాను యుండును. పాపాత్ముల హృదయ మెప్పు డును చింతల చే కొట్టబడుచుండును.

53. భగవంతుడు అందరియందును సమానముగా యున్నాడు కాని, భగవంతునియందు అందఱును సమానముగా లేరు. భగవంతునిమీద భ క్తిగలిగినవారు చాలామంది యుండ వచ్చునుగాని, భగవంతునిదయను సంపాదించినవారు అరుదుగా యుందురు.

54. రాజు యను పదమునకు అర్థమేమనగా ధర్మ దీక్ష గలి సమ స్తజనులయొక్క కష్టములు తొలగించి, సంతోషముగలిగించి సర్వమానవులయొక్క హృదయములను రంజింపజేయువాడు గాన రాజు యను పేరు గల్గెను. 55. ఒక మనుష్యుడు బుద్ధభగవానుని జూచి, స్వామి! భగవంతుడున్నాడా? యని అడుగగా వారిట్లనిరి. "భగవంతుడు 3 ఉండుట లేకుండుట అట్లుండనిమ్ము. దానివలన మన కేమియు లాభము లేదు. మనహృదయమాలిన్యమే మనల నమిత బాధ లను పొంద జేయు చున్నది. అందువలన నీ అంతఃకరణము శుద్ధము