పుట:ఉపదేశ రత్నములు మలయాళ స్వామి 1948.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

20


49. పూర్వజన్మమునందు పుణ్యము జేసినవారే ఇప్పుడు ప్రపంచములో సమస్తభోగభాగ్య సుఖములు యున్నారు. పూర్వజన్మమునందు పాపముజేసినవారే ఇప్పు డీ ప్రపంచములో ఏ సుఖములు లేక దరిద్రముచే బాధపడుచున్నా రని తెలియవలెను. పుణ్యాత్ములైనవారికి పుణ్యమైన సంతోష కార్యములు చూచినప్పుడు ఆనందము పొంగుచుండును. పాపాత్ములకు మంచిపుణ్యకార్యములు చూచినప్పుడు వారి నేత్రములకు మహాబాధ కలుగుచుండును. ఎట్లనగా, దీపప్రకాశము, మనోహరమైనదైనను కంటిరోగము గలిగినవారికి మహాబాధ గలిగించునుగదా!

50. మనదేశమునందు లోకోద్ధారకులైన మహాపురుషు లనేకులు పుట్టిరి. వారందరును మాతల్లి పవిత్రురాలగుట వల్లనే అట్టి పవిత్ర గర్భములో పుట్టుట చేతనే మాకు లోకసేవ జేయునట్టి పవిత్రబుద్ధి పుట్టుటకు కారణమైనదని వారివారి తల్లులను అధికముగా పొగడుకొనిరి. కాన, స్త్రీ హృదయ మెట్లుండునో అట్టి పుత్రులే పుట్టుదురు. కాబట్టి లోకమును చెఱచుటకుగాని, బాగుపఱచుటకుగాని స్త్రీలయొక్క పవిత్రాపవిత్రతలే కారణములైయున్నవి.

51. మనదేశమునందు ఏ దేవుని పేరు చెప్పినను, ఏ మహాపురుషుని పేరు జెప్పినను, ముందు స్త్రీ శబ్దమే వచ్చుచున్నది. అదెట్లనగా లక్ష్మీనారాయణ, గౌరీశంకరులు, సీతారాములు, స్త్రీ పురుషులు, తల్లిదండ్రులు. ఇట్లు ప్రతిపదము నకును స్త్రీ పదములే ముందు వచ్చుచున్నవి. ఇది చూచి విచారించి పాణిని మొదలైన మహావ్యాకరణవేత్తలు మొదట