పుట:ఉపదేశ రత్నములు మలయాళ స్వామి 1948.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

19

మునకు శూన్యమని అర్థము జేసి బుద్ధభగవానులను శూన్య వాదియని చెప్పినారు. శ్రీకృష్ణపరమాత్మ భగవద్గీతయందు నిర్వాణపదమును నాలుగైదుచోట్ల వచించియున్నారు. ఇదిగాక శ్రీశంకరాచార్యులవారు నిర్వాణషట్కమని కొన్ని శ్లోకము లనే చెప్పియున్నారు. నిర్వాణ పదమునకు శూన్యార్థ మైనచో శ్రీకృష్ణభగవానులున్నూ శ్రీజగద్గురు శంకరాచార్యులున్నూ చెప్పుదురా! మరేమన ఆకాలమునందు బ్రాహ్మణులు రాజుల చేత జీవహింసారూపమైన యజ్ఞములను విశేషముగా జేయించు చుండిరి. అట్టి హింసారూపమైన యజ్ఞములను బుద్ధభగవానులు ఖండించి నిలిపి వేయించినందువలన బ్రాహ్మణులు బుద్ధమతము శూన్యమతమని ప్రచారము చేసిరిగాని బుద్ధభగవానులు నవ మావతారమని మనదేశములో ప్రసిద్ధియైయున్నది.

48. భగవద్గీతయందు కృష్ణభగవానులు ఆఖరున మోక్ష సన్యాసయోగమే చెప్పినారు. శ్రీరామచంద్రుడును ఆఖరున సర్వ సంగ పరిత్యాగియై సన్యసించెను. పంచపాండవులును అంత్య దశయందు సన్యసించినట్లే యున్నది. కాబట్టి ఆఖరున ప్రతి వారును సన్యాసము పొందవలయును. అయితే అధికారులై న వారికే సన్యాసము చెప్పబడెను. అధికారి గాకుండానే బాహ్య సన్యాసము తీసుకొన్నచో వాడు ఉభయభ్రష్టుడగును. బాహ్య సన్యాసము కన్నను, సంకల్పసన్యాసము గొప్పది. దానికన్నను .అవిద్యాసన్యాసము ఇంకా గొప్పది. ఈ మూడు సన్యాసము లను ఎవరు సంపూర్ణముగా ధరించినారో వారు సంపూర్ణ సన్యాసి యని చెప్పబడుదురు.