పుట:ఉపదేశ రత్నములు మలయాళ స్వామి 1948.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

18

లను విడిచి పెట్టమని ఇట్లు చెప్పుట చేత ఇహలోకపు భర్తలను అర్థముగాదు. దేహపోషణకై ఇహలోకపు యీ భర్త యున్నూ, ఆత్మరక్షణకు పరమాత్మమున్నూ, వీరిరువురు యుండుట మంచిది. ఇహలోకపు భర్త లేనివారు కేవలము పరమాత్మనే నమ్ముకొ నుట మేలు.

45. భక్తిలో నాలుగురకములవా రున్నారు. ఎట్లనగా శైవ వైష్ణ వాద్యనేక మతస్థులు ఒకరిమతము నొకరు నిందించు కొనుచు,ఒకరి దేవత నొకరుఅసహ్యించుకొనుచు తుటకు కంటితో నైనను ఇతర దైవములను చూచుట కిష్టపడుకుందురు. ఇది కేవల సంకుచితభ క్తి యనబడును. తమమతమును తమ ఇష్ట దైవమును వీడక తక్కి నమతములను వారిదై వములను గూడా సమత్వముగా జూచుట, మధ్యమభక్తి యనబడును. సర్వశరీరములందును వెలుగుచున్న ఆత్మయే పరమాత్మయని తెలిసి అట్టి విశ్వరూప మును ధ్యానించుటయు, ప్రేమించుటయు ఉత్త మభక్తి యన బడును, దృశ్యమును దృక్కును అంతయు పరమాత్మస్వరూ పమే యనెడి పూర్ణావస్థను బొందుట కేవల ముత్తమోత్తమ మని చెప్పబడును.

46. వేదమునందు పూర్వకాండయనియు నుతరకాండ యనియు రెండుభాగములు గలవు. అందు పూర్వభాగమంతయు ధర్మార్థ కామముల కుపయోగమగు కర్మ కాండను దెల్పుచున్నది. రెండవ భాగమగు నుత్తర కాండమంతయు మోక్ష స్వరూపమైన నివృత్తి మార్గమును బోధించుచున్నది. ష్యా 47. బుద్ధభగవానులు నిర్వాణమున పదమును లక్ష్యఅర్ధముగా జెప్పినారని ఇతరమతస్థులు కొందఱు నిర్వాణమను పద