పుట:ఉపదేశ రత్నములు మలయాళ స్వామి 1948.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

17

పొరపాటు చే ఇతర రంగులను జూచినచో బాధ హెచ్చుచుం డెను. ఒక్కనాడు ప్రభువుగారి గురువు వచ్చి ఈ వర్తమానము రాజు చేత విని ఓ రాజ బ్రహ్మాండమున కంతయు పచ్చరంగు వేయించుటకు నీచేతనగు పనిగాదు. నే నొక చిన్న సదుపాయము జెప్పెద వినుము. ఆకుపచ్చరంగుగల కళ్లజోడు ఒక్కరూపాయకు దొరకును. ఆజోడు కళ్లకు బెట్టుకొన్నచో జగమంతయు ఆకు పచ్చగానే తోచునని చెప్పి ఆప్రకారము జేయించెను. రాజుగారు గురువుగారి యొక్క బుద్ధివికాసమునకు బ్రహ్మానందముపొంది. ననుస్కరించి బహుమతులు కూడా ఇచ్చెను. అట్లే ఎవ్వరైనను ప్రపంచమంతయు శుద్ధసత్వపరబ్రహ్మముగా చేయవలెనని శ్రమపడుట సాధ్యమగుపని గానేరదు. కాన తన హృదయము పరిశుద్ధము చేసుకొన్నచో ప్రపంచమంతయు శుద్ధముగానే గోచరించును.

44. భర్త యనగా భరించువాడని యర్థము. ఒక స్త్రీకి యొక పురుషుడు భర్త యగుచున్నాడు. భర్తకుగూడా మఱియొక భర్తయున్నాడని తెలియవలెను గాన, సర్వ బ్రహ్మాండములను భరించు భర్త యొకరు గలరని మఱువగూడదు. అట్టి పరమా త్మను భర్త గా వరించినట్లైన యాభర్త చనిపోవువాడు కాడు. కాబట్టి ఎప్పటికిని సుమంగళులై యుందురు. శాశ్వతసుఖమును పొందుదురు. అట్లుగాక ఇహలోక భర్తలనే నమ్మినచో వారొక 3 నాటికి చనిపోవుట నిజము. అప్పుడు విధవత్వము, దుఃఖమున్నూ రాకతప్పదు. ఇట్టిభర్తలు అనంతజన్మములలో నెంద రైయుం దురో గాన యీ భర్తలందరును స్వప్నావస్థలో గలుగు భ ర్త లెంతో వీరును అంతియేనని తెలియవలెను.