పుట:ఉపదేశ రత్నములు మలయాళ స్వామి 1948.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

16

నారు. ఎందువల్లననగా తను, ధన, మనములు మూడును గురు వున కర్పించి తనకేమి కరవ్యము లేక భృత్యుడై యుండవల యును. అట్లుగాక ఈశిష్యుడు లేకపోయినచో నా కెట్లు జరుగునా యని గురువుగారున్నూ, నేను లేకపోతే ఈ మఠ మెటుజరుగునో చూచెదమనుకొనెడు శిష్యుడును యుండుట అశాస్త్రీయమని చెప్పడు.

42. కొన్ని మఠములలో, మంచి భోజనములు, ఫలహా రములు, బాగుగా దొరకుచుండును. శిష్యులందరును ఆ భోజన పదార్దములను సంతోషముగా భుజింతురు. అందులో కొందరు శిష్యులు ఫలహారములుమాత్రము సంపూర్ణముగా భుజింతురు. కాని, ఏదైనా పని చెప్పినచో పండుకొని మూల్గుచుందురు. వారెట్టివారనగా, దొంగ ఎద్దులవంటివారని చెప్పబడుదురు. ఎట్లన కొన్ని ఎద్దులు మేతమాత్రము పూర్ణముగా తినును.నాగలి గట్టినచో పండుకొనును. అట్టివారు లోకములో గౌరవింపబడ నేరరు. వారికిన్నీ సుఖము లేదు. ఎటనగా చక్కగా శుద్దముగా బెరిగిన కొయ్యలే గొప్ప ఖరీదుగలవి యగును. వంకరగా యుండునవి అంతఖరీదు గావుగదా!

43. ఒక రాజునకు నేత్రములు జబ్బు చేసి బహు బాధ పడుచుండెను. ఒక వైద్యుడు వచ్చి నీవు పచ్చని వస్తువులనే చూచుచుండినచో ఈ బాధ తగ్గిపోవునని చెప్పి వెళ్ళెను. అప్పుడా ప్రభువు తనకోటలోయున్న మేడల కన్నిటికీ కొన్నిలక్షలు. ధనమును ఖర్చు బెట్టి ఆకుపచ్చరంగు వేయించెను. ఆ రంగును జూచుటచే రాజునకు కొంచెము బాధ తగ్గుచుండెను. ఎప్పుడైనను