పుట:ఉపదేశ రత్నములు మలయాళ స్వామి 1948.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

13

33. చీకటియందు ప్రయాణము చేయునప్పుడు బ్రాహ్మ ణుడై నను, సన్యాసియైనను, చండాలుడైనను, దీపము చేతిలో యుండినచో, సుఖముగా ప్రయాణము చేయగలుగుదురు. ఎవని వద్ద లాంతరు లేదో వారు గుంటలో పడకపోరు. అలాగే జ్ఞానము று కలిగినచో నెవ్వరైనను మోక్షము జెందుటకు సందియము లేదు. జ్యోతి లేనిచో బ్రాహ్మణుడైనను నరక మనుభావిలో. పడక తప్పదు.

34. మానవునికి నెలరోజులైనచో పితృదేవతల కొక్క దినమగును. అందుచేత అమావాస్యనాడు, పితరులకు తర్పణ జేసినట్లయిన వారికి ప్రతిరోజు భోజనము పెట్టినట్లే యగును. మానవుని సంవత్సరము దేవతలకు ఒక్క దినమగును. అందు వలన సంవత్సరమున కొక్కసారి యుత్సవము జేసినడైన వారికి ప్రతిరోజును జేసినట్లేయగును.

35. వేదాంతభాష మహాగంభీర మైనట్టిది. అందువలన మహాసూక్ష్మబుద్ధితో సంజ్ఞారూపముతో తెలుసుకొనవల యును. ఎట్లనగా టెలిగ్రాం భాష నోటితో మాటలాడక టకటకమని వేళ్ల తో కొట్టెదరు. కావున, ప్రక్క స్టేషను మేష్ట 3 రుకు కూడా యాభాష వచ్చియుండినచో నరము జేసుకొనగలడు. ఆభాష తెలియనిచో ఎట్లు తెలుసుకొనగలడు? అట్లే గురుశిష్యు 3 లిరువురును వేదాంత పరిభాష తెలిసినవారైయుండవ లెను.


36. శంకరరామానుజ మధ్యాది మహామతక ర్తలందరును ఒకరివిూదనొకరు విరోధముచేత ఒకరి మతముల నొకరు ఖండిం చినవారు కారు. మ రేమనగా, ఆయా దేశకాలములనుబట్టి జీవుల