పుట:ఉపదేశ రత్నములు మలయాళ స్వామి 1948.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

12

గూడా యున్నది. మొట్టమొదట ఈ చెప్పబడిన త్రిపుటిని జయిం చినచో తదనంతరము ఎన్ని త్రిపుటులున్నను సులభముగా పటా పంచలు జేయవచ్చును. ప్రత్యక్షముగా గాన్పించుచున్న త్రిపు టినే జయించ లేకున్న వారు అతిసూక్ష్మమై అంతరాంతమందు న్న మహాత్రిపుటిని రహిత మొనర్చినామని జెప్పినచో పెద్దలు హరించబోరు.

31. జ్ఞానయోగము, భక్తి యోగము అను రెండు యోగ ములు గలవు. అందు జ్ఞానయోగము అతిస్మూతి సూక్ష్మ మైనది. అట్టి జ్ఞానయోగమునందు నిలువ లేకపోయినచో భ క్తి యోగమునే అవలంబింపవచ్చును. అయితే జ్ఞాన యోగ మున కెన్ని సుగుణము లుండవలయునో భక్తి యోగమునకు గూడా అట్టి సుగుణము లన్నియు సంపూర్ణముగా ణ జ్ఞానయో నుండవలయును. భక్తి_జ్ఞానములకు లక్ష్యములలో కొంచెము భేద ముండు నేగాని లక్షణములు మాత్రము రెంటికిని ఒక్క టేవిధమని తెలియవలెను. అయితే నారాయణస్మరణ జేయబోయి నరులస్మరణ చేయ జొకండి.

32. సృష్టి అయినది మొదలు పరమాత్మకు ఇప్పటివరకు ముఖ్యభక్తులు _ అయిదుగురే దొరికినారట. ఆరవభక్తుడు ఇంత వఱకునుదొరక లేదట. ఆ ఐదుగు రెవరనగా ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి ఇవియే పంచభూతములు ఈ అయిదుగురు భక్తులును అనాదినుంచియు ఇప్పటినఱకును భగవదాజ్ఞ లన లేశ మైనను మీరక ఆచరించుచున్నారు. కావున భక్తులై నట్టివారు ఈపకారముగా భగవదాజ్ఞాబద్ధులు గావలెను.