పుట:ఉపదేశ రత్నములు మలయాళ స్వామి 1948.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

11

యోగము చెప్పబడినది, ఈ రెండును వైద్యము లే యగుచున్నవి. అయితే ఈ రెంటికికూడా పథ్యము తప్పకయుండవలయును.

28. గురువుయొక్క ఆత్మలోయున్న భావమును తెలుసు కొని నటించువాడు ఉత్తమశిష్యుడు. కనుసైగను గెలసి ప్రవ ర్తించువాడు మధ్యముడు. వాక్కుచే ఒక్క సారి చెప్పినంతనే కార్యము చేయువాడు అధముడు. రెండుమారులు చెప్పవలసి వచ్చినచో వాడు గురు సేవకు పనికిరాడు. శిష్యునికి మొదటిపని గురు కార్యము చేయుటయు, రెండవ పని, దైవపూజ, జపధ్యాన ములును, మూడవపని అతిథి అభ్యాగతులయొక్క సేవయు, తన పని నాల్గవదిగా ఎవడు గుర్తించునో వాడు ఉత్తమాధికారియని చెప్పబడుచున్నాడు.

29. ఎవరు అధికారులు గాకుండానే సన్యాసము గోరు చున్నారో వారిబుద్ధి ఎటువంటిదనగా కూలికి మట్టిపని చేసుకొను నొక వడ్రీవాడు తాను కష్టపడి సంపాదించినడబ్బు సంసార ఖర్చు నకు చాలనందున అధిక ముగా సంపాదించగోరి కలెక్టరుపనికావలెనని కోరుకున్నట్లుండుయని తెలియవలెను. అనగా తారకమే సాధించ లేనివాడు అమనస్కమున కెటర్లు డగును?

30. ముఖ్యసారాంశ మేమనగా మనస్సునందుండు భావ మునేవాక్కు చేసత్యము జెప్పుటయు, వాక్కు చేతఏది చెప్పుచున్నావో ఆకార్యమును తప్పక కాయముచే చేయుటయు, జరుగునుగాన ఈమనో వాక్కాయములను మూడింటినే త్రిపుటియని పెద్దలు చెప్పుదురు. ఈత్రిపుటి ఎప్పుడు ఏక మగునో అదియే త్రిపుటి రహిత మనబడును. ఈత్రిపుటిగాక దీనికవ్వల వేరొక త్రిపుటి