పుట:ఉపదేశ రత్నములు మలయాళ స్వామి 1948.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

10

వచ్చునుగదా! అలాగే పెట్టెలోయున్న పుల్లలన్నియు గీచి వెలిగించినచో ఎంత మహాగ్నియగునో చూడండి! అట్లే అ ఆ యణువు లన్నిటిని తపస్సుచే ప్రజ్వలింపజేసినచో మహ త్తరమైన సిద్దులను, శక్తులను ఇచ్చుచుండును. కాబట్టియే గవర్నమెంటు వారు గొప్ప తెలివిగల్గిన వారి శిరస్సులను పరీక్షించుటకై లక్షలు ధనమిచ్చి కొనుచుందురు.

25. ప్రతిమానవునికిని రెండు హస్తము లున్నవి. అందులో ఒక హ సముచేత పరమాత్మను పట్టుకొనండి. వేరొక హ స్తము చేత సంసారమును పట్టుకొనండి. ఒక కంటితో పరమాత్మను జూడండి. వేరొక కంటితో ప్రపంచమును జూడండి. అందువల్లనే పరమాత్మ మనకు రెండేసి అవయవము లిచ్చియున్నాడు. ఒక వేళ విడువదలంచినచో ప్రపంచమును విడిపించవలెను గాని, పరమాత్మను ఎప్పుడున్నూ వీడరాదు. పరమాత్మ ధ్యానము చేయనివాని జీవితము అడ్రసు లేని జాబువంటి దగుచున్నది. అనగా అడ్రసు లేని జాబుగతి యేమగునో వీని బ్రతుకును అట్లే యగునని ఎఱుంగుము.

26. ఎంతవఱకు నేను బ్రాహ్మణుడను, శూద్రుడను, నేను దేహముగలవాడను అను మర్త్యబుద్ధియుండునో అంతవఱకు జననమరణములు తప్పకయుండును. నేను కేవలము పరమాత్మ స్వరూపుడను. పై జెప్పిన కులవర్ణ భేదాలు నాకు లేవని ఎప్పుడు చక్కగా ఎఱుంగునో అప్పుడుమాత్రమే జన్మరాహిత్యమగును.

27. స్థూల దేహారోగ్యముకొఱకు వేదమందు ఆయు ర్వేదము చెప్పబడినది. సూక్ష్మ దేహారోగ్యము కొఱకు జ్ఞాన