పుట:ఉపదేశ రత్నములు మలయాళ స్వామి 1948.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8

లేదు. ఏలనన తానొకప్పుడు ఆనందమును ఎఱిగి అనుభవించి యుండుటవల్లనే ఆనందమును కోరుచున్నాడని చెప్పవలసి యున్నది. కాబట్టి జీవులు ప్రారంభములో ఆనందములో నుండియే వచ్చినవనియు ఆనందముకొఱకే ప్రయత్నించుచున్నవనియు, తుదకు ఆనందములోనే చేరవలసియున్నవనియు, చెప్పవలసి యున్నది. అందుచేత ఆత్మకు ఆనందత్వము సిద్ధించినది.

21. జాగ్రతావస్థ, స్వప్నావస్థయందు లేక పోవుచున్నది. స్వప్నావస్థ జాగ్రతావస్థయందు మిథ్యయగుచున్నది. జాగ్రత్స్వ ప్నంబులు రెండును సుషుప్త్యవస్థయందులేక పోవుచున్నవి. ఇట్టి మూ డవస్థలును ఒకదాని చేనొకటి కొట్టబడుచు ఒకదానినొకటి ఎఱుగలేక క్షణికములై తిరుగుచున్నవి. ఆత్మయన్ననో అవస్థాత్రయముల మూడింటి నెఱుంగుచు త్రికాలములయందును నశింపులేక స్వయంప్రకాశమై సత్థామాత్రమై యుంటున్నది. కాబట్టి ఆత్మకు సత్యత్వము సిద్ధించినది.

22. ఖురానులో మహమ్మదుగారు ఏమి బోధించినారనగా, ఇస్లామునుతమును ప్రేమించిన వారిని నీప్రాణమువలె జూడమని చెప్పినారు.

బైబిలుగ్రంథములో క్రైస్తు ఏమిబోధించినారనగా నీవలెనే నీ పొరుగువారిని చూడమనిరి. బుద్దుడు ఏమి చెప్పెననగా నీవు ఎట్టిసుఖమును గోరుచున్నావో అట్లే సర్వజీవరాశియంతయు అట్టిసుఖమునే గోరుచున్నది గాన, చీమనైనను చంపకూడదని చెప్పిరి. ఓహో! బుద్ధభగవానుల మత మెంతవిశాలమైనదో చూడుడు.