పుట:ఉపదేశ రత్నములు మలయాళ స్వామి 1948.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

7


లన్ని టియందును వెదకి వెదకి, విసిగి, యొక్కచోట ఏకాంతముగా గూర్చుని మనస్సు నేకాగ్రముచేసి ఆత్మయందు నిశ్చలుడై నచో బ్రహ్మానందముచే తృప్తుడగుచున్నాడు.

18. ప్రపంచకోరికలను సమూలముగా నిర్మూలనము జేసి కేవలాత్మాకారస్థితిలో నెం తెంత నిలుకడ కలుగుచున్నదో వాని కంతంత సంకల్పసిద్ధి గల్గును. అయితే ఆత్మ శుద్ది గల్గువఱకు ఏ కోర్కెలను కోరగూడదు. ఒక వేళ తాను కోరిన సంకల్పములు సిద్ధించక సిదించక పోయినచో నాకార్యము నెవరో చెడగొట్టినారని పరుల యెడ విరోధించగూడదు. అట్లగుటకు తన తపస్సు యొక్క దుర్బ లత్వమే యని తలంచవలయును.


19. ఎవరినైననుజూచి, నీ వెవ్వర వనినచో నేను నేనని అంద రును చెప్పుదురు గాన అందరియందును నే ననుపదార్ద మున్నట్లు గోచరించుచున్నది. ఆ నే ననువస్తువును వెదకి విచారించబూని నచో నది దేహమేనని చెప్పెదమన్న దేహమును గూడా ఎఱుం గుచున్నది. కాన దేహమని చెప్పకూడదు. అట్లే మనోబుధ్యా దులనుకూడా ఎఱుగుచున్నదిగాన వాటికన్నను వేరుగా యున్న దని చెప్పవలెను. అట్లే సూర్యచంద్రాదులను పంచమహాభూత ములను ఎఱుగుచున్నదిగాన వానికన్నను వేరుగాయున్న దనవల యును. తత్ప్రకారముగా సర్వదృశ్యమును ఎఱుగుచున్నందున ఆత్మకు జ్ఞానత్వము సిద్ధించినది.

20. ఆత్మకు ఆనందత్వము కూడా గలదు. ఎట్లనగా పిపీ లీకము మొదలుకొని బ్రహ్మపర్యంతముగల సర్వజీవులును ఆనం దముకొఱ కే ప్రయత్నించుచున్నవి. దుఃఖము నేజీవియు కోరుట