పుట:ఉపదేశ రత్నములు మలయాళ స్వామి 1948.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

14

యొక్క అధికారము ననుసరించి జీవులయొక్క మేలుకొరకే ఆయామతములను స్థాపించిరని తెలిసికొనవలయును.

37. ఒకరు అద్దమును చేతబట్టుకొని దృశ్యముతట్టు త్రిప్పియుంచినచో నా యద్దమునందు దృశ్యమే యగపడును. కాని, తన దేహ మేమాత్రము అద్దమునం దగపడనేరదుగదా, అటే అంతఃకరణమనెడి అద్దము దృశ్యముతట్టు 3 దృశ్యముతట్టు త్రిప్పియుంచి నచో ఎదుటనున్న దృశ్యమే యగుపడును గాని, తన స్వస్వరూ పమైన ఆత్మ గానుపించనేరదు.

38. సముద్రజలము అవిరిరూపమున మేఘముల జేరి అచ్చటనుంచి వర్ష రూపమున పర్వత ప్రాంతములలో దుమికి చిన్న చిన్న కాలువలుగా ప్రవహించి నదీనదములలో ప్రవేశించి బహు వేగముగా తన గమ్యస్థానమైన సముద్రము జేరువరకును మధ్య నెచ్చటను నిలువక పోవుచుండును. అయినను, కృష్ణాగోదా వరి మొదలైన మహానదులకు అచ్చటచ్చట కొన్ని పుణ్యఘట్ట ములవద్ద అనేకజనులు స్నానములు, పూజాదులు జేయుచు, ఆ నదులను అధికముగా కీ ర్తింపుచుందురు. ఆనదు లాపూజాగౌర నములను మన్నించక అచ్చట నిమిషమైనను నిలువక సముద్రము నకు పోయి విశ్రమించునట్లు, సాధకులైన జిజ్ఞాసులు కూడా తమ స్వ స్వరూపమైన పరమాత్మను జేరువఱకు ఎన్ని మఠములు ఏర్పడి నను, ఎంతమంది శిష్యు లేర్పడినను, ఎన్ని గౌరవములు గల్గినను తుదకు అణిమాది మహాసిద్ధు లడ్డమువచ్చి ప్రార్థించినను, ఏ త్రము నిలువక తన గమ్యస్థానమైన బ్రహ్మానందములో మాత్రము విశ్రాంతి జెందువరకు మధ్య నిలువకూడదు.