పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉధ్బటారాధ్యచరిత్ర

పీఠిక

ప్రథమఖండము

1. పరిచయము

1. మతమీమాంస

తెనాలి రామలింగకవి ఉద్భటారాధ్యచరిత్రము అను నీ ప్రబంధమును మొదట సాహిత్యలోకమున కెఱుకపఱచిన కీర్తి కీర్తిశేషులు వేటూరి ప్రభారకరశాస్త్రిగారిది. వా రీగ్రంథ మా కాలమున అనగా క్రీ. శ. 1926 లో ముక్త్యాలలో వెలువడుచుండిన సరస్వతి పత్రికలో పీఠికతో గూడ ప్రకటింపఁజేసిరి[1].

వేటూరి వారు దీనిని 1925 లో వెలువరించినను దీనిని గూర్చి అంత కేడేండ్లకు ముందే వారికి తెలియును. 1918 లో వారు ప్రకటించిన “ప్రబంధరత్నావళి" పీఠిక 24 పుటలో నిట్లు వ్రాసినారు.

  1. మాహిష్మతీ ముద్రాక్షరశాల-ముక్త్యాల - 1926. సరస్వతి-అను నీ పత్రికాధిపతులు శ్రీ రాజా వాసిరెడ్డి దుర్గాసదాశివేశ్వర ప్రసాదు బహద్దరు - జయంతిపురం రాజావారు. ఇది 1923 - 1928 మధ్యనడచినది. ఇందే దగ్గుబల్లి దుగ్గన నాచికేతూపాఖ్యానము, అప్పన చారుచర్య మొదలగు ప్రాచీనకావ్యములు ప్రథమముగా ప్రకటితమైనవి. శ్రీ వేటూరివారి, తెలుగుదేశపు సంస్కృతకవులు అన్న వ్యాసములిందే ప్రకటితములై నవి. అవి తరువాత పునర్ముద్రితము కాలేదు. See diterary Journalism by N. Venkatarao, V.R. Narla Shashtyabdapurti Commemoration Volume History of Telugu Journalism (1968)