పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

"రామలింగయ్య- తెనాలి-రామకృష్ణుడు వేఱు, రామలింగడు వేఱుగా మా. రా. కవిగారు వ్రాసినారు. (ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచిక) సత్యము కావచ్చును." అని తెలిపి ఉద్భటారాధ్యచరిత్రమునుండి-

  1. ఉ. గ్రాంథిక సన్నుత ప్రతిభ గాంచిన....
  2. సీ. మహితమూల స్థాన మల్లికార్జున....
  3. మ. పరగన్ వారిధి వేష్టితాఖిల...... అను పద్యములను

ఆశ్వాసాంత గద్యము నుదాహరించినారు. ఆపై నిట్లువ్రాసినారు. మన్మిత్రులు చల్లా సూర్యనారాయణరావు పంతులుగారు దీనిని బంపినారు. పాండురంగమాహాత్మ్యకర్తయు, నేతత్కృతి కర్తయు నొక్కరేయనిగాని వేఱనిగాని నిర్ధారింప దేలకున్నది. అతడు నీతడును రామయ పుత్రులే "శైవ వైష్ణవ పురాణావళీ నానార్థరచనాపటిష్ఠైకరమ్యమతిని" కావున నాతఁడు గూడ నీ శైవ కథ రచియించియుండఁదగును. అక్కడ రామకృష్ణుఁడని యిక్కడ రామలింగఁడని యున్నది. ఇక్కడఁ దెనాలి ప్రశంస కానరాలేదు. ఈ యుద్భటారాధ్యచరిత్రము గూడ బయల్పడినఁ గాని యథార్థము తేలదు. ఇందూదాహరింపఁబడిన పద్యమందు, నాదెండ్ల గోప మంత్రి పేర్కోఁబడినాఁడు. ఈ రామలింగనికిఁ గుమార భారతి యని బిరుదు".

ప్రభాకరశాస్త్రిగారిట్లు 1918 లో వ్రాసినను 1925 నాటికి గ్రంథము సమగ్రముగా పరిశీలించి, ఉద్భటారాధ్యచరిత్ర కృతికర్త రామలింగడు, పాండురంగమాహాత్మ్య కృతికర్త రామకృష్ణుడును నొక్కరేయని నిర్వివాదముగా నిరూపించిరి. వారి ప్రథమ ముద్రణ పీఠిక యనుబంధముగా తిరిగి ముద్రితమైనది. ద్వితీయ ముద్రణమున గ్రంధపూరణ వివరములు సమబంధములో చూపబడినవి.

2. తెనాలి రామలింగ (కృష్ణ) కవి

2. వంశోత్కర్ష - వివరములు

ఈ గ్రంథమునకు రామలింగకవి కర్తయైనట్లుగా, ఆశ్వాసాంతగర్య వలన తెలియుచున్నది.