పుట:ఉదాహరణము (గణపవరపు వేంకటకవి).pdf/2

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈ యుదాహరణము లభింపలేదు. ఈతని కాలనిర్ణయమును గుఱించి యొక్కొక్క రొక్కొకవిధముగ వ్రాసియున్నారు. [1]కానీ యీతని కాలనిర్ణయము సులభముగాఁ జేయువిషయము నాతఁడే తాను రచించిన విద్యావతీదండకములో నిట్లు చెప్పియున్నాఁడు—

“ దండకము ” — శ్రీ విశ్వనాథా స్వయాంబోధిచంద్రుండు ... సత్కా
శ్యపాభిఖ్య గోత్రుండు, భాస్వచ్చరిత్రుండు, శ్రీతిర్మలోర్వీతలాధీశ
పౌత్రుండు వీరావనీపాలపుత్రుండు, వీరాధివీరస్తుతోదారవచ్చొక్క
నాథక్షితీశాగ్రణీసోదరుం డాశ్రితత్రాణబద్ధాదరుం డద్రికన్యాసమా
నోల్లసల్లింగమాంబావధూగర్భశుక్తిస్ఫురన్ మౌక్తికాకారుఁడై
యొప్పు ముద్దళ్ ఘరి క్షోణిపాలుండు....... చొకాటంబుగా రాజసం
బెచ్చ నిండు పేరోలగంబుండి.......విద్యావతీ కన్యకారత్న మాత్మీ
యమౌ నాట్యశాలాస్థలీపాత్రలందెల్ల సన్మానపాత్రంబుగా శ్రీమించి
వర్ధిల్లు... గుణామేయ లక్ష్మీనివాసస్ఫురత్ పాండ్యసింహాసనా
ధ్యక్షుపేరన్ జయోదాత్తముద్దళ్ గిరి క్ష్మాతలాధీశుపేరన్, వృషాద్రీశ
సంకాశుపేరన్, మహాలక్షణ గ్రంథభాషాభిదాన ప్రథామాధురీ
సాధురీత్యర్థవచ్ఛబ్ద బంధానుబంధ ప్రబంధాది నాథాప్పయామాత్య
రాడ్వేంకటార్య. ప్రణీతంబుగాఁ బొల్చు నా పుష్పకోదండకంబైన
విద్యావతీదండకం బుర్వి నాచంద్రతారార్క మై యొప్పు నెల్లప్పుడున్.”
(A Descriptive Catalogue of Telugu Manuscripts vol viii Yak-
shaganas and Dandakas (No. 1834-2040) No 2014. Page 2262&2263.)

మధురను పరిపాలించిన సుప్రసిద్ధాంధ్రనాయక రాజవంశమునకుఁ జెందినవాఁడీ ముద్దళగిరి. ఈతఁడు ముద్దు వీరప్ప నాయకుని కొమా

  1. 1. ప్రబంధరాజము పీఠిక - పూండ్ల రామకృష్ణయ్య గారు. 1892 2. వీరేశలింగము పంతులుగారు ఆంధ్రకవుల చరిత్ర తృతీయ భాగము 163-168 పుటలు 3. ఆంధ్రసాహిత్యపరిషత్పత్త్రిక - 3 సం 4. శతకవుల చరిత్ర, 2 వ భాగము-195-196 పుటలు. 5. ఆంధ్రకౌముది పీఠిక - ఆంధ్రసాహిత్యపరిషత్ప్రకటితము.