పుట:ఉదాహరణము (గణపవరపు వేంకటకవి).pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రుఁడు. చొక్కనాథనాయనికిఁ దమ్ముడు. చొక్కనాథనాయకుఁడు, రాజ్యభారము వహీంపలేని వయస్సున రాజ్యమునకు వచ్చుటచే, ముద్దళగిరియే రాజ్యభారము వహించెను. ఈతఁడే తంజావూరిపై దండెత్తి, విజయరాఘవనాయకుని నోడించి దానిని వశపఱచుకొనెను. ఈనృత్తాంతము క్రీ. శ. 1679 లో జరిగినది. కావున నీటినికిఁ గృతి నిచ్చిన వేంకటకవియు నా కాలమువాడనుట నిర్వివివాదాంశము. ఈతఁడు వీరేశలింగము పంతులుగారు చెప్పినట్లు, కూచిమంచి తిమ్మకవి తరువాతివాఁడు గాఁడు. పరిషత్పత్రికాసంపాదకులు చెప్పినట్లు, విజయరంగచొక్కనాథుని కాలములోవాఁడు గాఁడు. ఈతఁ డప్పకవి సమకాలికుఁడు. విద్యావతీదండకము[1] ముద్రితము. ఈతని ప్రబంధరాజము పునర్ముద్రణము చేయవలసిన యుద్గ్రంథములలో నొకటి. ఈతనిఁ 'యాంధ్రకౌముది' వేయి చరణములు గలవ్యాకరణము పరిషత్ప్రకటితము. ఈతని నిఘంటువు వేంకటేశాంధ్రము 1898 లో కాకినాడ సుజనరంజనీముద్రాక్షరశాలలో ముద్రితము. ఈతని కృతులలో ద్విరూపకోశమును, ఆంధ్రప్రయోగరత్నాకరమును ముద్రింపఁదగిన శాస్త్రీయగ్రంథములు, ఈ రెండుగ్రంథముల ప్రతులుసు తంజావూరిలో సరస్వతీభాండారముననున్నవి.

  1. విద్యావతీదండకము, మదరాసు ప్రాచ్యలిఖితపుస్తకశాలవారిచే, నాచే సంస్కరింపబడి ముద్రితము. (1947 సం॥)