పుట:ఉదాహరణపద్యములు.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

56

అగస్త్యునికి - భీమేశ్వరపురాణము – శ్రీనాథుఁడు
సీ. ఎవ్వాఁడు వింధ్యాద్రి నిఱ్ఱింకు లింకించె
గంభీరకంఠహుంకారగర్జ
ప్రణవప్రంచాక్షరోపనిషత్ప్రపంచంబు
నెవ్వాఁడు శివునిచే నెరిగికొనియె
గడసిల్లుధరయొడ్డ గెడవెన నెవ్వాఁడు
త్రాసుపైఁ గటిలచందమున వంచె
నంభోధు లేడింటి నాపోశనం బెత్తి
కలిగించె నెవ్వాఁడు క్రమ్మఱంగ
గీ. భీమనాథేశ్వరుఁడు గౌరిఁ బెండ్లియాడి
దక్షిణాముఖకల్యాణదర్శనమున
వత్సరము వత్సరమున నెవ్వానిఁ జూచు
నతఁడు గగనాగ్రమాణిక్య మరుగుదెంచె.

కాశీఖండము—
సీ. ప్రణవపంచాక్షరోపనిషత్ప్రపంచంబు
కడదాఁక నెఱిఁగిని కఱదలాని
వాతాపిదైత్యు నిల్వలునితోఁ గూడంగ
జఠరాగ్ని వేల్చిన సవనకర్త
కోపించి నహుషుని గుంభీననంబుగా
హుంకార మిచ్చిన యుగ్రతేజు
వానకాలమునందు వండవట్టిన నీటి
కాలుష్యముం దెలుపు కతకఫలము
గీ. పాండుభసితత్రిపుండ్రాంకఫాలభాగ
భద్రరుద్రాక్షమాలికాభసితవక్షు
భార్యయును దాను నేతెంచు పరమశైవుఁ
గాంచె వింధ్యాచలేంద్రంబు కలశభవుని.