పుట:ఉదాహరణపద్యములు.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

57

ఋష్యశృంగునికి - భాస్కరుని రామాయణము – బాలకాండము
ఉ. అంగన లేగుదెంచి ముదమారఁగ గాంచి రధీతవేదవే
దాంగుని సర్వసంయమిముఖాబ్జపతంగుని నిర్జితేంద్రియా
నంగుని లిప్తభూతలసదంగుని సద్గుణసంగునిన్ వ్రతా
భంగుని సంతతోదితతపఃకృతభంగుని ఋష్యశృంగునిన్.

దేవేంద్రునికి - భావన పెమ్మనంగారి అనిరుద్ధచరిత్రము
సీ. ఉచ్చైశ్శ్రవంబును నురుమదసురభిక
పోలపాళీవిలోలాలికలర
వాన్వితమై వాలు నభ్రశుండాలంబు
వాహనంబులు వీరవైరిభీష
ణాంశుల మించు నూరంచుల కైదువు
కొమరారు పరివార మమరగణము
పట్టన(పు)దేవులు పౌలోమి యీగతి
నెల్లభోగములకు నెల్ల యగుచు
గీ. విలసదమరికరాంభోజవీజ్యమాన
చామరానిలసంచారచలితచారు
చికురభారుఁడై చూడఁగఁ జెలువు మిగిలి
వేయుగన్నుల యింద్రుఁడీ విభుఁడు దరుణి.

అగ్నిదేవునికి - పురుషార్థసుధానిధి – పిల్లలమఱ్ఱి వీరయ
సీ. భర్గభట్టారకు పర్యాయమూర్తికి
షాణ్మాతురుని కూర్మిజనకునకును
మేషరాజము నెక్కు మేటిరౌతున కమ
రాధీశు పొరుగు దిశాధిపతికి
హరిణవాహనుని నెయ్యపుసంగడీనికి
సామిధేనిప్రియస్వాంతునకును
యాయజూకులయిండ్ల ననుఁగుఁజుట్టమునకు
స్వాహాస్వధాప్రాణవల్లభునకు