పుట:ఉదాహరణపద్యములు.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

55

వీరమాహేశ్వరము —
సీ. కల్పాంతవార్ధి మోఁకాలిబంటిగా నేయ
తీశ్వరుఁ డొంటిమైఁ దిరిగినాఁడు
వటపత్రవిధిని నెక్కటినున్న బాలు నే
తాపసాధిపుఁడు ముద్దాడినాఁడు
తనపేర నే తపోధనమౌళి సుస్థిర
స్థితి బురాణంబు సంధించినాఁడు
హరుని మెచ్చించి సంహారకాలుని జయో
న్మాద మే మునిరాజు మాన్చినాఁడు
గీ. గనియె నటువంటి సంయమీంద్రుని మహాత్ము
దనయుఁడుగ నమ్మృకండుని ధర్మపత్ని
సహజశివభక్తిరతుని విశ్వప్రసిద్ధు
ననఘకీర్తి మార్కండేయుఁ డనెడివాని.

మృకండునికి - జైతరాజు ముమ్మయ విష్ణుకథానిధానము
సీ. ఆయువగ్గలముగా నాశీర్వదింపుచో
నేపుణ్యుఁబురుడింతు రెల్లవారు
జనులకు నేమహాత్ముని పురాణము సర్వ
వర్ణాశ్రమాచారనిర్ణయంబు
నేయయ్య చేసిన యీశ్వరస్తోత్రముల్
పఠియించినను మృత్యుభయము వాయు
... ... ... ...
శివలింగములఁ బ్రతిష్ఠించి నెగడె
గీ. నట్టి లోకైకమాన్యు మహానుభావు
సుతునిఁగా బడసి వెలసిన సుకృతమయుని
ఘను మృకండుమునీంద్రునిఁ గరివిభుండు
గనియెఁ దొలుమేన సుకృతపాకమునఁ జేసి.