పుట:ఉదాహరణపద్యములు.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

52

పద్మపురాణము
చ. అతులమనీషఁ బేర్చి నిగమావలి చిక్కులు దీర్చు సూత్రముల్
దృతి నొనరించి పెంపెసగు దివ్యపురాణములెల్లఁ జెప్పి భా
రత మనుపేరి వేదము తిరంబుగ జేసెను విష్ణుమూర్తి సూ
రత మహనీయబోధను బరాశరసూనుగురించి మ్రొక్కెదన్.

చిరుమురి గంగరాజు – కుశలవోపాఖ్యానము
క. హరిదాసును వనవాసును
బరిచితపరమోపవాసు భాసురవాసున్
...................................
విరచిత కాశీనీవాసు వేదవ్యాసున్. (ఆ - ప)

నన్నయభట్టు – ఆదిపర్వము
ఉ. భారతభారతీశుభగభస్తిచయంబులఁ జేసి ఘోరసం
సారవికారసంతమసజాలవిజృంభముఁ బాచి సూరిచే
తోరుచిరాబ్జబోధనరతుండగు దివ్యుఁ బరాశరాత్మజాం
భోరుహమిత్రుఁ గొల్తు మునిపూజితు భూరియశోవిరాజితున్.

శుకయోగికి - భాగవతము
సీ. ప్రతినిమేషము బరబ్రహ్మంబు నీక్షించి
మతిఁ జొక్కి వెలుపల మఱచువాఁడు
కమలంబుమీది భృంగముల కైవడి మోము
పై నెరసిన కేశపటలివాఁడు
గెర వ్రాసి మాయ నంగీకరించిన భంగి
వసనంబుఁ గట్టక వచ్చువాఁడు
సంగిగాడని వెంట జాటు భూతముల కా
బాలుర హాసశబ్దములవాఁడు
తే. మహితపదజానుజంఘోరుమధ్యహస్త
బాహువక్షోగళాననఫాలకర్ణ
నాసికామస్తకనయనయుగళుఁ
డైన యవధూత శుకమూర్తి యరుగుదెంచె.