పుట:ఉదాహరణపద్యములు.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

53

కశ్యపునికి - శ్రీరంగమహాత్మ్యము
మ. జగముల్మూడు తలంపులోన సృజియింపంజేయు వాగ్వల్లభున్
మిగులం గూర్మితనూజుఁగాఁ గనిన లక్ష్మీనాథుఁ డెవ్వానికిం
బొగడొందన్ సుతుఁ డయ్యె నట్టి సుమహత్పుణ్యుం బ్రశంసింపఁగాఁ
దగదే కశ్యపసన్మునీంద్రుని విశుద్ధజ్ఞాననిస్తంద్రునిన్. (అ1-ప-24)

భరద్వాజునికి - కుడిచెర్ల తిప్పరాజు కాంచీమహత్వము
మ. జ్వలదగ్నిప్రథమానతేజుని భరద్వాజున్ వినిర్ధౌతవ
ల్కలభాస్వత్పరిధాను బింగళజటాలంకారుఁ గృష్ణాజినో
జ్జ్వలసంవ్యాను దపఃకృశీకృతతనున్ శాంతాత్ము బ్రహ్మైకని
శ్చలచిత్తున్ విజితేంద్రియున్ బ్రముదితస్వాంతున్ గృపావంతునిన్.

శ్రీనాథుని నైషధము—
శా. తోరంబైన తపోవిశేషమున సద్యోజాతవక్త్రంబునన్
గౌరీవల్లభూచేత దీక్షగొనుచున్ సప్తర్షులం దొక్కఁడై
తారావీథి నలంకరించి కనియెం ద్రైయ్యర్థసంఘాతమున్
భారద్వాజమహామునీంద్రుఁ దగదే భక్తిం బ్రశంసింపగన్. (అ1-19)

బృహన్నారదీయము —
శా. అంభోజాసనమానసాంబుజభవుం డధ్యాత్మవిద్యోన్నతా
రంభుం డిద్ధతపోవిశేషమితప్రస్ఫీతఘోరాఘసం
రంభుం డంచితశాంతిసంయుతుఁడు భారద్వాజమౌనీంద్రు డు
జ్జృంభించెన్ వరసప్తసంయమిజనశ్రేణీసముద్భాసియై.

విశ్వామిత్రునికి - శాకుంతలము – పిల్లలమఱ్ఱి వీరయ్య
సీ. పంచాక్షరీమంత్రపరమోపనిషదర్థ
వాసనాసురభి యెవ్వానిబుద్ధి
శ్రుతిపాఠపూతవాక్పతిముఖస్తుతులచే
వదిలె నెవ్వడు నవస్వర్గసృష్టి