పుట:ఉదాహరణపద్యములు.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

49

రాజశేఖరభారతీజహ్నుకన్యక
సుకవీంద్రులకు భావశుద్ధిఁ జేయు
మాఘవాణీశీతమారుతగతి సార
మతులకు రోమోద్గమంబుఁ జేయు
ఆ. నని యెఱింగి వారియడుగులు దలఁచి న
మస్కరించి దండి నమ్మురారి
వామనుని గుణాఢ్యు క్షేమేంద్రు నిల నలం
కారవిధులఁ దలఁచి గారవమున.

కవినుతి – నన్నయభట్టు - గంగాధరుని బాలభారతము
క. శబ్దార్థరసవిశారదు
శాబ్దికమూర్ధన్యు శబ్దశాసనబిరుదున్
శబ్దాయమానవిస్ఫుర
శబ్దఘటారభటి నన్నపార్యుఁ నుతింతున్.

శ్రీనాథుని భీమఖండము—
క. నెట్టుకొని కొలుతు నన్నయ
భట్టోపాధ్యాయ సార్వభౌముఁ గవితా
పట్టాభిషికుతు భారత
ఘట్టోల్లంఘన సమర్థు (పటిష్ఠ) గాఢప్రతిభున్. (అ1-ప8)

కవినుతి – తిక్కనసోమయాజికి - గంగాధరుని బాలభారతము
ఉ. ఆంధ్రకవిత్వతత్త్వసముదంచితకీర్తినిఁ దిక్కయజ్వ నీ
రంధ్రతరప్రభావనిధిం బ్రస్తుతిసేయుఁదు నుల్లస
త్కంధ్రగభీరమంజుతరగర్జితవిభ్రమభవ్యభంగి సై
రంధ్రికయైన చాటుమధురస్ఫుటబంధురవాగ్విజృంభికన్.

ఉ. పంచమవేదమై పరఁగు భారతసంహిత నంధ్రభాషఁ గా
వించెఁ బదేనుపర్వములు విశ్వజగద్ధితబుద్ధి నెవ్వఁ డ
క్కాంచనగర్భతుల్యున కఖండితభక్తి నమస్కరింతు ని
ర్వంచితకావ్యవైభవవిరాజికిఁ దిక్కనసోమయాజికిన్.

(భీమఖండము 1-9)