పుట:ఉదాహరణపద్యములు.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

48

బ్రణుతింతు నుద్దండభాషాసమాక్షిప్త
హరబాహుకేయూరుఁ డగు మయూరు
సన్నుతి గావింతుఁ జాటుధారాప్రౌఢిఁ
గోమలతాయత్తు సోమదత్తు
గీ. భక్తి నంజలి రచియింతుఁ బ్రవరసేన
భాస శివభద్ర భవభూతి భట్టహర్ష
భారవి మురారి హేరంబ చోరులకును
మఱియుఁ దక్కిన సుకవుల మతిదలంతు.

శ్రీనాథుని భీమఖండము—
సీ. ప్రణుతింతు రసభావభావనామహనీయ
కవితాసముల్లాసుఁ గాళిదాసు
గణుతింతు నిరవద్యగద్యపద్యనిబద్ధ
పరితోషితస్థాణు భట్టబాణు
భజియింతు సాహిత్యపదవీమహారాజ్య
భద్రాసనాసీనుఁ బ్రవరసేను
వర్ణింతు నంభోధివార్వీచిసంభార
గంభీరవాక్సముత్కర్షు హర్షు
తే. భాస శివభద్ర సౌమిల్ల ధమ్మిలులకు
మాఘ భారవి బిల్హణ మల్హణులకు
భట్టి చిత్తప కవి దండిపండితులకుఁ
గీలు కొలుపుదు నొసలిపైఁ గేలుదోయి.

అమరేశ్వరుని విక్రమసేనము—
సీ. భట్టనారాయణభాషారమాదేవి
లబ్ధవర్ణుల కర్థలబ్ధిఁ జేయు
బాణవాగ్భామినీప్రసవమంజరి విశా
రదుల కలంకారరమణిఁ జేయు