పుట:ఉదాహరణపద్యములు.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

47

కవిస్తుతి – వ్యాసులకు - గంగాధరుని బాలభారతము
శా. సంసారార్ణవపారగుం బరమహంసవ్రాతచూడాపదో
త్తంసంబున్ శ్రుతిసంకరోద్దళనపాథక్షీరభేదక్రియా
హంసంబున్ జగదేకవంద్యు జలదశ్యాము న్మహాపాతక
ధ్వంసాభారతు భారతామృతవిధిన్ వ్యాసుం బ్రశంసించెదన్.

భీమఖండము
మ. తలతున్ భారతసంహితాధ్యయనవిద్యానిర్మితిప్రక్రియా
నలినప్రోద్భవునిం గళిందతనయాంతర్వేదిపుణ్యస్థలీ
పులినాభోగకృతావతారు నపరాంభోజాక్షు నక్షీణని
ర్మలసాహిత్యకలాసమృద్ధికై పారాశర్యమౌనీశ్వరున్.

కవినుతి – కాళిదాసుకు - ఆంధ్రకవి రామయ్య కాంచీమహత్వము
శా. ద్రాక్షాపాక వీనవైఖరిఁ బ్రబంధస్తోమముల్ సెప్పె న
ధ్యక్షుండయ్యె మహాకవీంద్రులకు నాహా యెట్టి పుణ్యాత్ముఁడో
సాక్షాద్భారతిఁ గాక యీతఁడు మనుష్యవ్యక్తియే యంచు సం
లక్షింపందగు గాళిదాసు గృతలీలావ్యాసుఁ గీర్తించెదన్.

సంస్కృతకవులకు - జైతరాజు ముమ్మయ విష్ణుకథానిధానము
ఉ. భారవిఁ గాళిదాసు శివభద్రుని మాఘుని బాణు భామహుం
జోరు మయూరునిం దలఁపుచున్ మఱియుం గవులై విదగ్ధు లె
వ్వారలు వారినెల్ల ననవద్యుల నాద్యులఁ బ్రస్తుతింతు సం
సారసుఖైకసారవిలసత్కవితారసవైభవార్థినై.

గంగాధరుని బాలభారతము
సీ. కైవార మొనరింతు గంభీరసాహిత్య
ఘంటాపథోద్భాసుఁ గాళిదాసు
వర్ణింతు నుజ్జ్వలవాణీసుధాపూర
పాథోధిపరిబాణు భట్టబాణుఁ