పుట:ఉదాహరణపద్యములు.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

46

కాంచనమౌంజీవికాసంబు గెడగూడి
చెలువు సూపుచు మృగాజినము దనర
కమనీయకోమలకరపయోరుహమునఁ
బ్రకటితంబగు విపంచిక దలిర్ప
గీ. హరికథాలాపశోభితమైన యట్టి
యాననంబు బ్రసన్నత నలరుచుండ
గగనమునుండి సమవర్తి కడకు వచ్చె
నమరసంయమివరుఁడు విద్యాగురుండు.

కవిస్తుతి
కవులకు – వాల్మీకిస్తుతి - కాకమాని గంగాధరుని బాలభారతము


శా. శ్రీరామాయణకావ్యకల్పన విరించి న్వేదఘంటాపథో
ద్ధారప్రౌఢమనీషి సర్గముని మార్తాండుం దపఃకీర్తి ల
క్ష్మీరమ్యున్భువనైకవంద్యుఁడగు వాల్మీకిం గవిగ్రామణిన్
ధారాళస్థిరభక్తియుక్తిఁ దలఁతుం దత్త్వజ్ఞచూడామణిన్

రెడ్డిపల్లి ముద్దరాజు అష్టమహిషీకల్యాణము
ఉ. రామకథాసుధారసము బ్రహ్మపయోంబుధి మున్గి యుండఁగా
నేమునివాక్యమందరమహీధరసన్మథనంబుచే సము
ద్ధామత సంగ్రహించి విబుధప్రకరంబున కిచ్చె నర్థిమై
నామహితుం బ్రచేతసుని యాత్మజుఁ గొల్చెద నాదిసత్కవిన్.

శ్రీనాథుని భీమఖండము
శా. శ్లోకంబుల్ శతకోటికాండములుగా సూత్రించి రామాయణం
బేకైకాక్షర మెల్లపాపములు మాయింపంగ నిర్మించి సు
శ్లోకుండైన పురాణసంయమివరుం జూతు న్మనోవీథి వా
ల్మీకిన్ బ్రహపదావతీర్ణకవితాలీలావతీవల్లభున్.