పుట:ఉదాహరణపద్యములు.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

45

హరిణాజినోత్తరరీయచ్ఛాయ బ్రహ్మతే
జఃకృశానుని పొగచాయ నెఱయ
కుటిలహవిర్మహీకుబ్జలలామంబు
నొసలిపైఁ జీఁకటి నూఁగువార
గీ. నచతురాననపద్మజుం డనలికాక్ష
శంకరుం డచతుర్భుజచక్రపాణి
యఖిలలోకైకసంపూజ్యుఁ డరుగుదెంచె
నారదుఁడు కాంతిజితశరన్నీరదుండు.

నిశ్శంకుని కొమ్మయ – వీరమాహేశ్వరము
సీ. కడిఁదియుద్ధంబులఁ గదిసి యాఁకలిదీర
మించు జూపుల నారగించువాఁడు
గడియసేపైన నొక్కెడ నూరకుండక
త్రిభువనంబుల సంచరించువాఁడు
నూఱుతంత్రులవీణె నూతనంబగు క్రియా
హేవాకమొప్ప వాయించువాఁడు
గోర్లు దాఁటించి నిర్నిమిత్తంబు
వీకున బోరు గావించువాఁడు
గీ. మునివరేణ్యుండు పద్మగర్భునికి నింపు
గొనలు సాగంగఁ బుట్టిన కొడుకుగుఱ్ఱ
చనియె శర్వాణిఁ గొలువంగఁ దనువిలాస
శారదాంబుదవర్ణుండు నారదుండు.

చందలూరి చిక్కన్న – నాచికేతోపాఖ్యానము
సీ. ప్రాలేయకిరణబింబస్ఫూర్తిఁ దలపించు
విశదంపుఁ దనుకాంతి దిశలు వ్రాక
జిగినిండఁ దొలఁకెడు జిగురుటాకులసొంపు
వాటించు ఘనజటాభరము మెఱయ