పుట:ఉదాహరణపద్యములు.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

44

ననుకైనకుసుమం బెట్టిన పల్లవంబుల
చాయ సన్నపు గుజ్జుజడలుగ్రాల
గందువోఁ జదలేటిఁ గడిగిమ శశిరీతి
యడగెలి ముత్యంపు గొడుగు దనర
గీ. జగతిఁ దనుకాంతి యసమచంద్రావి
భాతిఁ బ్రసరింప దివినుండి పార్థివేంద్రు
కొలువునకు వచ్చె సభయెల్ల నెలమిఁ జూడ
నారదుఁడు సర్వలోకవిహారశీలి.

బమ్మెర పోతరాజు భాగవతము – ప్రథమస్కంధము
సీ. తనచేతివల్లకీతంత్రీచయంబునల
సతతనారాయణశబ్ద మొప్ప
నానాసంగీతహరిగీతవరసుధా
ధారల యోగీంద్రతతులు సొక్కఁ
గపిలజటాభారకాంతిపుంజంబుల
దిశలు ప్రభారతధీ (తధీధితి) వహింప
తనులగ్నతులసికాదామగంధంబులు
గగనాంతరాళంబు గప్పుకొనఁగ
ఆ. వచ్చె మింటనుండి వాసవీనందను
కడకు మాటలాడఁ .... తోడ
భద్రవిమలకీర్తిపారగుం డారూఢ
నయవిశారదుండు నారదుండు.

పిల్లలమఱ్ఱి వీరయ్య – శాకుంతలము
సీ. కర్పూరనవపరాగవిపాండుతనుకాంతి
యకదొరచారుచంద్రికలు గాయ
వికటారకూటపల్లకడారముల
బద్ధమగుటంబు రేయెండ చిగురులీన