పుట:ఉదాహరణపద్యములు.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భాగవతులకు - మణికి సింగరాజు పద్మపురాణము
సీ. హరిసేవనామృతాహ్లాదుఁ బ్రహ్లాదును
సన్నుతచారిత్రు శక్తిపుత్రు
సంగీతవిద్యావిశారదు నారదుఁ
బుణ్యతమశ్లోకుఁ బుండరీకు
భారతసంహితాభ్యాసు వేదవ్యాసు
నతులపావనవేషు నంబరీషు
నవిరళజ్ఞానవిద్యాసముత్సుకు శుకుఁ
గ్లిష్టాఘకర్దమగ్రీష్ము భీష్ము
గీ. నరు విభీషణు సనకు సనందుఁ గపిలు
వాయునందను శేషాహి వైనతేయు
లాదియగు భాగవతులను నాళువారిఁ
బరమభక్తిఁ దలంపుదుఁ బ్రతిదినంబు.

భైరవుని శ్రీరంగమహత్త్వము
మ. వినుతింతున్ హరిభక్తిపెంపున జగద్విఖ్యాతులై పుణ్యకీ
ర్తనులైనట్టి పరాశరుం గపిలు వేదవ్యాసుఁ బ్రహ్లాదు న
ర్జును రుక్మాంగదు నంబరీషుని వసిష్ఠుం బుండరీకుం మరు
త్తనయున్ భీష్ము విభీషణున్ సురమునిన్ దాల్భ్యున్ శుకున్ శౌనకున్.

నారదునికి—
సీ. ఉదయార్కరుచిఁ బొర నొలచికొన్నట్టి మ
వ్వమున చెంగావి గోపనము మెఱయ
వెన్నెల జరిగొన్న విద్యుల్లతలమాడ్కి
యజ్ఞోపవీతంబు లరుతఁబొలయ