పుట:ఉదాహరణపద్యములు.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

41

భాస్కరుని రామాయణము – యుద్ధకాండము
సీ. కుప్పించు నురవడి కుంభిని వడిగ్రుంగి
సర్పాధిపతితలల్ చదియనడుమ
నెగయు నూఁకున మీదికెత్తిపారిన తరు
శ్రేణులు చుక్కలం జెదరనడువ
నెఱులు సారించునేపునం గడలొత్తి
యేడువారాసులు నెడములొత్తఁ
బరుచు బల్విడి నభ్రపంక్తులు నుడిఁగొంచు
వలయంపుఁగొండ యవ్వలికిఁదూలఁ
గీ. బర్వతములు వడఁక బ్రహ్మాండకోటర
మద్రువ గగనవీథి నరుగుదెంచె
రఘుకులేంద్రబంధనిఘటితత్వరితాంత
రంగుఁ డగుచు నవ్విహంగవిభుఁడు.

భైరవుని శ్రీరంగమహత్వము - విష్వక్సేనునికి
క. శ్రీరమణచరణసేవా
చారనిరూఢానధాను సత్కీర్తిజయ
శ్రీరాజమానుదానవ
వీర ఖగశ్యేనుఁ దలతుఁ విష్వక్సేనున్.

రామకవి రామయ్య – కాంచీమహత్వము
శా. ఇష్వాసక్రకచాదిసాధనపరాహీనప్రభాంగీకృతా
భిష్వంగద్యుమణిద్యుతిప్రకరుఁడై పీతాంబరాలంకృతున్
విష్వక్సేనుని గౌస్తుభాభరణు నుర్వీశ్రీయుతుంగొల్చి యా
విష్వక్సేనుఁడు సంచరించు గణరాడ్విఖ్యాతుఁ డాచక్కటిన్.