పుట:ఉదాహరణపద్యములు.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

40

ఆంధ్రకవిరామయ్య – కాంచీమహత్త్వము
సీ. గజకచ్ఛపంబు లె ....రుని............
కుక్షిలోనికిని రాజభిక్ష
సకలలోకములు నే జవసత్వసంపన్ను
ఖురళికాయాత్రకు గోష్పదంబు
బలభేదివజ్రమే యలఘు రెక్కలలోనఁ
జిక్కిపెంపె........... చితపుల్ల
కద్రూతనూజవర్గంబు లే మహనీయు
నాగ్రహంబునకుఁ జొక్కాకుపటువ
తే. యతఁడు హరిఁ గొల్వ నచ్చోటి కరుగుదెంచె
శంఖచూడాసుదక్షిణక్షమపయోద
వాహనోదారతాభీలసాహసైక
జనితదాక్షిణ్యుఁడైనట్టి వినతపట్టి.

భైరవుని శ్రీరంగమహత్వము
ఉ. ఆయతచండతుండనిహతాహినికాయునిఁ దప్తహాటక
చ్ఛాయుని సర్వవేదమయసన్నుతకాయుని దేవదానవా
జేయుని నప్రమేయుని నశేషవిహంగకులాధిపత్యధౌ
రేయునిఁ బ్రస్తుతింతు సుచరిత్రవిధేయుని వైనతేయునిన్.

భాగవతము – దశమస్కంధము
క. అక్షీణకనకసన్నిభ
పక్షయుగోద్భూతఘోరపవమానమహా
విక్షేపకంపితానే
కక్షోణిధరేంద్రుఁ డగుచు గరుడుఁడు వచ్చెన్.