పుట:ఉదాహరణపద్యములు.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

39

సోముని హరివంశము
మ. హరిదంతద్విపదంతకుంతశిఖరాహంకారనిశ్చింత ని
ర్జరరాజార్జితవజ్రజర్జరితవిచ్ఛాయైకరోమచ్ఛని
స్థిరవిద్యుద్ప్రతిపక్షవక్షుఁడయి వచ్చెన్ వైనతేయుండు భా
స్కరబింబమ్మును నంబరమ్ము దగమ్రింగం బట్టుచందమ్మునన్.
(స్కరబింబప్రతిబింబమంజరము మ్రింగంబాఱు చందంబునన్)

(ముద్రితప్రతి)



నన్నయభట్టు – ఆదిపర్వము
ఉ. ఆతతపక్షమారుతరయప్రవికంపితఘూర్ణితాచల
వ్రాతమహార్ణవుండు బలవన్నిజదేహసముజ్జ్వలప్రభా
ధూతపతంగతేజుఁ డుదితుండయి తార్క్ష్యుఁడు తల్లికిన్ మనః
ప్రీతి యొనర్చుచు న్నెగసె భీమజవంబున నభ్రవీథికిన్.

నిశ్శంకుని కొమ్మన
సీ. పులుగురాయఁడు తమ్మికొలఁకుల చెలికాని
బండిబోయినితోడి పాలివాఁడు
పన్నగస్త్రీలకు బాలిండ్ల పసపాస
మగుడింప నోపిన మగల మగఁడు
దంభోళి కొకయీకతాఁకు కానిక సేసి
యమృతంబుఁ దెచ్చిన యవఘళుండు
వినతముద్దులపట్టి వనధిచెంగట బోయ
పల్లె నాఁకలిగొన్న భవ్యబలుఁడు
గీ. పక్షములు దాల్చి వచ్చిన పసిఁడికొండ
యట్టు విలసిల్లు మేటి వాహనము గాఁగ
నడచె హతశేషదేవసైన్యములు దాను
నసురకులమర్దనుండు జనార్దనుండు.