పుట:ఉదాహరణపద్యములు.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

37

సోముని హరివంశము - పాంచజన్యము
సీ. వడఁకు బన్నగరాజు బడగలమీఁద స
ర్వంసహాకాంతపేరుర(రణ)ము సూప
నుఱ్ఱూతలూగిన యుదయాస్తగిరులచే
నాకాశలక్ష్మి కోలాటమాడఁ
దెరలెత్తి సప్తసాగరములుఁ బొరలంగ
వరుణుండు గొండిలి పరిఢవింప
మొకములచాయ వేరొక చందముగ నిల్చి
కమలసంభవుడు పెక్కణ మొనర్ప
గీ. మంగలములోని పేలాలమాడ్కిఁ జుక్క
లిక్కడక్కడఁ జడ దిక్కు లెనిమిదియును
బగులఁ బాతాళములును గుబ్బతిలఁ జెలఁగె
శౌరి పూరింప నప్పాంచజన్యరవము.

భావన పెమ్మనంగారి అనిరుద్ధచరిత్రము
ఉ. ధన్యవిభూతిశోభితుఁడు తామరసేక్షణుఁ డొత్తె నూర్జిత
ధ్వన్యతులోగ్రతాదళితదానవసైన్యము ధూతభూతచై
తన్యముఁ దోషితీండ్రముఖదైవతసంస్తుతిమాన్యము న్నదీ
జాన్యుదరాంతరస్థగితసన్నుతజన్యము పాంచజన్యమున్.

గరుత్మంతునికి - అనుశాసనికము – సోమయాజి
చ. ఘనతరకంధరుండు దృఢకాయుఁడు దీర్ఘముఖుండు రక్తలో
చనుఁడు మహోత్తమాంగకుఁడు సానుసుసంగతపక్షసారమం
డనుఁడు బరిస్ఫురద్యుతివిడంబితబాలదివాకరుండు లో
కనయనపర్వనిర్వహణకారి సుపర్ణుఁడు వుట్టె భూవరా.