పుట:ఉదాహరణపద్యములు.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

36

క్రవ్యాదయౌవనిగ్రైవేయమణిహార
కహ్లారదీప్తుల గర్వ మడఁచి
దైవతాహితవీరతరుణీసముల్లాస
దరహాసచంద్రికా దర్ప మడఁచి
గీ. చటులసంవర్త పరివర్త చండకిరణ
శతశతాఖిల పరిదీప్త సారఘోర
దర్శనం బగునట్టి సుదర్శనంబు
గలుగ నీ కసాధ్యంబులు గలవె కృష్ణ.

సోముని హరివంశము—
సీ. దైతేయమదవతీధమ్మిల్లములతోడ
విరుల నెత్తావికి వీడుకోలు
దనుజశుద్ధాంతకాంతాకటాక్షములతోఁ
గలికికాటుకలకుఁ గానివావి
దానవమానినీస్తనకుంభములతోన
బసపుబయ్యెదలకుఁ బాయు తెరువు
దైత్యావరోధనదయితాధరములతో
సొబగు వీడెములకుఁ జుక్కయెదురు
గీ. సేస సురసుందరీకరౌశీరతాల
వృంతచలితాంతకుంతలవిలసదింద్ర
కులవధూటీలలాటికాకుంకుమంబుఁ
బదిలపఱుపఁ జక్రంబ నీభరమకాదె.

మ. సతతంబు న్నుతియింతు జంతుమయసంసారక్రియారక్షణా
క్షతశౌర్యక్షపితారిపక్ష మగుటన్ సంగ్రామభీమభ్రమా
గతగేహాంతికదీర్ఘికాతటలుఠత్కంఠచ్ఛిదాచ్ఛాదన
క్షతజక్షౌళితకేలితామరసరక్షశ్చక్రముం జక్రమున్.