పుట:ఉదాహరణపద్యములు.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

31

సీ. ప్రాణంబుఁతో గూడ రక్కసి చన్నులఁ
బాలు ద్రాగిన ప్రోడబాలుఁ డితఁడె
వ్రేల్మిడిఁ జాణూరు విరచి లోకములు మె
చ్చించిన యాజగజ్జెట్టి యితఁడె
దుర్వృత్తుఁడగు గంసు దునుమి యాతని తండ్రిఁ
బట్టంబు గట్టిన ప్రభు వితండె
సత్యభామకు పారిజాతంబుపైఁ గల
కోర్కె దీర్చిన రసికుం డితండె
గీ. వెన్నలును గోపికాచిత్తవిత్తములును
నరసి మృచ్చిలనేర్పు నా హరి యితండె
శ్రుతిశిరోభాగములఁ దన సుభగచరణ
సరసిజామోదమున నూను జతురుఁ డితఁడె.

(సోమయాజి యుద్యోగము)



సీ. తొమ్మండ్రుకొడుకులఁ దొలివేలుపుల జేయ
బొడమించె నేదేవు బొడ్డుదమ్మి
మూడుత్రోవలఁ బాఱు మున్నీటిగర్తనాఁ
బరగు నేదేవుని పాదతటిని
పండ్రెండురూపుల పగలింటిరాజు దా
వలతి యేదేవుని వలనుఁ గన్ను
వేయిమానికెపుదివ్వెలతోడఁ బడగల
మ్రాల్చు నేదేవుని మలక పాన్పు
గీ. మునులకెల్ల నేదేవుని మూర్తి వెలుఁగు
హృదయగేహంబులో దీప మెత్తినట్లు
హరి మురారి నద్దేవు మహానుభావు
మనసులో గంటి భవములు మానునంటి.