పుట:ఉదాహరణపద్యములు.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

30

సీ. కమలజుదమ్ముడు గొమరుండుఁ గూడి నీ
మూర్తియుఁ గీర్తియు మూదలింపఁ
జతురాస్యు జదువులం జననియుఁ గూడి నీ
యునికియు మనికియు నుపచరింప
హరుశిరోమాల్యంబు వరధనుప్రభయు నీ
యజ్జయు సజ్జయు ననుసరింప
గీ. ననుసరింపఁగ నేర్తు నీ వఖిలజగము
జగము లొగిఁబ్రోవ నిల్చిన జగదధీశ
యీశ వాణీశ నిర్మలహృదయవాస
వాసుదేవ జగత్త్రయావాసదేవ

సీ. సూర్యునింబోలు గౌస్తుభముపైఁ బ్రాలంబ
మనియెడు బరివేష మతిశయిల్ల
మేఘంబు సరియైన మేనిపైఁ బీతాంబ
రప్రభయును దటిత్ప్రభలు మెఱయ
నిండుఁ జందురు నవ్వునెమ్మొగంబున సుప్ర
సన్నతయును సుధాసార మమర
జలజంబుఁ దెగడెడు జరణంబునను దివ్య
దీర్ఘికయను బువ్వుదేనె దొరుగ
గీ. హస్తముల శంఖచక్రగదాంబుజంబు
లమర ధర్మార్థకామమోక్షముల మాడ్కి
నఖిలలోకేశుఁ డాద్యుఁ డన్యయుఁ డమేయుఁ
డమ్మహాత్ముంజు మెరయు నారాయణుండు.