పుట:ఉదాహరణపద్యములు.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

28

ద్దేవీఖేలనలోలచిత్తుఁడగు శ్రీదేవుండు కృష్ణుండు
సద్భావం బొప్పఁ గృపావలోకనమునం బాలించుఁ ద్రైలోక్యమున్.

(రెడ్డిపల్లె ముద్దమరాజు – అష్టమహిషీకల్యాణము)



శా. ఓనారాయణ యోమురాసురహరా యోభక్తచింతామణీ
యోనీలాంబుదవర్ణ యోగుణనిధీ యోలోకరక్షామణీ
యోనీరేరుహపత్రనేత్ర కృప నాయుల్లంబులో నుండవే
యోనావే భవభందముల్ జెరుపవే యోదేవకీనందనా

(సోముని హరివంశము)



శా. ఓలక్ష్మీపతి యోపురాణపురుషా యోపుణ్యసంకీర్తనా
యోలోకేశ్వర యోగజేంద్రవరదా యోద్వారకావల్లభా
యోలీలామనుజావతారనటనా యోకృష్ణ యోయచ్యుతా
యోలి న్నాదు మనస్సరోవరములో నోలాడవే యోహరీ.

మ. జయనారాయణ పుండరీకనయనా శార్ఙ్గీ జగన్నాయకా
జయపీతాంబర భక్తవత్సలవిరించిస్తోత్రపాత్రక్రియా
జయ జంభారివిరోధివిక్రమకళాశ్లాఘవిఘాతక్రమా
జయగోవింద ముకుంద మంథరధరా శౌరీమురారీహరీ.

చ. అసదృశసర్వశాస్త్రనిచయంబుల కొప్పుఁ బురాణపంక్తిలో
మిసిమి సమస్తవేదముల మీగడ మంత్రచయంబులోని య
య్యుసురు విశిష్టధర్మముల యుక్కుతపంబుల చేవ యంచు నిం
పెసఁగఁగ నీదునామము మునీంద్రులు సెప్పుదు రర్థి నచ్యుతా.

ఉ. అంగజగాల మాపదకు వ్యాధులకెల్ల బొజంగు భీతికిం
గొంగ దరిద్రవృత్తమునకు గొయ్య యఘంబుల వేరువిత్తు దు
స్సంగతి వెన్నుసమ్మెట విషప్రకరంబుల డెత్తి దేవ నీ
మంగళనామధేయము సమాశ్రితభక్తివిధేయ మచ్యుతా.

(జైతరాజు మమ్మయ – విష్ణకథానిధానము)