పుట:ఉదాహరణపద్యములు.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

27

గీ. నట్టి పరమపురుషు నాదినారాయణుఁ
బుండరీకనయను భుజఁగశయను
జిన్ముయాత్ముహరి హృషీకేశుఁ గేశవు
నిను భజింతు రఖిలమునులు సురలు.

(భాస్కరరామాయణము – యుద్ధకాండము)



శా. శ్రీరామాస్పదమైన పేరురముపై శ్రీవత్సచిహ్నంబుదా
నారూడంబుగఁ దాల్చి శ్రీకిఁదగు చిహ్నంబొప్పువాఁడౌటసొం
పారందెల్లమిసేయు దేవుఁడు కృపావ్యాసక్తుఁడై మామక
ప్రారంభంబు నిరంతరాయశుభసాఫల్యంబుగాఁ జేయుతన్.

ఉ. శ్రీకినిరంతరంబుఁ గడుఁజెన్నెసలారఁగ రాగలీల ను
త్సేకముఁ బొందియొప్పు తనచిత్తము సూపెడు మాడ్కి నిత్యర
మ్యాకృతియైన కౌస్తుభము నక్కుపయిం బచరించు నుత్తమ
శ్లోకుఁ డహోబలేశుఁడు ద్రిలోకుఁడు లోకముఁ గాచు గావుతన్.

(ఎఱ్ఱాప్రెగడ నరసింహపురాణము)



ఉ. శ్రీస్తనకుంకుమద్రవనిషిక్తభుజాంతరభాగవిస్ఫుర
త్కౌస్తుభనూతనార్కరుచిగర్వితనాభిసరస్సరోరుహ
ప్రస్తుతమత్తభృంగరవరాగరసోల్బణభోగిభోగత
ల్సాస్తరణుం దలంచు సుకృతాత్ము లపాస్తకిల్బిషుల్.

శా. శ్రీరామాకుచమండలామిళితకాశ్మీరార్ద్రవక్షంబుతోఁ
బారావారతరంగసంగతలసత్పర్యంకనాగంబుపైఁ
గారుణ్యామృతపూరపూరితకటాక్షశ్రీల బెంపొందుగం
భీరస్వాంతుఁ డనంతుఁ డాశ్రితజనాభీష్టప్రదుం డెల్లెడన్.

(అనంతన్నఛందము)



శా. శ్రీరామాగృహలిప్తసన్మృగమదశ్రీఁ బొల్చి వక్షంబునన్
శ్రీవత్సంబు వెలుంగఁ గౌస్తుభము లక్ష్మీదీపమై యొప్పున