పుట:ఉదాహరణపద్యములు.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

26

సీ. సింహాసనము చారుసితపుండరీకంబు
చెలికత్తె చెలువారుబలుకుచిలుక
శృంగారకుసుమంబు చిన్నిచుక్కలరాజు
పసిఁడికిన్నెరవీణె పలుకుఁదోడు
నలువనెమ్మోముదమ్ములు కేలిగృహములు
తళుకుటద్దంబు సత్కవులమనసు
వేదాదివిద్యలు విహరణస్థలములు
చక్కనిరాయంచ యెక్కిరింత
గీ. యెపుడు నేదేవి కాదేవి యిందుకుండ
చంద్రచందనమందారసారవర్ణ
శారదాదేవి మామకస్వాంతవీథి
నిండువేడుక విహరింపుచుండుగాత

(శ్రీనాథుని నైషధము)



ఉ. చీటికిమాటికిన్ మొగుపుచేతులు మౌళి ఘటించి మ్రొక్కెదన్
హాటకగర్భుబోటికి మహాకవికాంక్షితకల్పకాటవీ
వాటికిఁ దారకాహృదయవల్లభమంజులపుష్పమంజరీ
జూటికి వల్లకీస్ఫురితశుద్ధవరాటికి వాగ్వధూటికిన్.

(భావన పెమ్మన – అనిరుద్ధచరిత్రము)



విష్ణుస్తుతి.
సీ. ఎవ్వని పొక్కిట నీరేడు జగములఁ
బన్నిన విభుఁగన్న పద్మమలరు
నెవ్వని యురమున నిందిర సవతియై
చిరలీలఁ గౌస్తుభ శ్రీవెలుంగు
నెవ్వని చేతుల హేతు లారఁగ గదా
కరవాల శంఖ చక్రమును మెఱయు
నెవ్వని యంఘ్రి మున్నిటిబాపములు బాయ
గంగపుట్టిన పుణ్యకథలు వొల్చు