పుట:ఉదాహరణపద్యములు.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

21

సీ. పాటించు నెయ్యది బహుల నిర్మలధర్మ
గంభీరమగు మూర్తిగౌరవంబు
కావించు నెయ్యది కాంతిమై దిశలకు
వాడని చంద్రికావైభవంబు
గర్జించు నెయ్యది ఖణిలు ఖణిల్లన
ఘోరవైతేయుల గుండె లగల
మెచ్చించు నెయ్యది మీనకేతనవైరి
వాహ్యాళికావల్గువల్గనముల
గీ. నది రయంబున నవ్విభునగ్రవీథి
నిర్భరారూఢినొప్పఁ బ్రాదుర్భవించెఁ
బృథులపదపాతనిర్ఘాతభీతపన్న
గేశ్వరంబైన శ్రీవృషభేశ్వరంబు.

సీ. గురుగోత్రతటములు గోరాడ నునుమొక్క
వోయిన వలిగొమ్ముదోయి మెఱయ
ఘనమేఘతలములు గాల్ద్రవ్వ క్రొమ్మెఱుం
గులపసనూనిన గొరిసెలొప్ప
భూరిదిగ్భిత్తులతో రాచికొన సన్న
గఱుకెక్కి కప్పారు కంఠ మొప్ప
నలఘు వాయుస్కంధములు దాఁకి తారలు
దొరుగ నాడెడు నిడుదోఁక యలర
గీ. తారశిఖరి గీలించిన మేరుశకల
మనఁగ ధవళాంగకల్పితంబైన పసిఁడి
పల్లమును రత్నకింకిణీ పరికరంబు
నసుర వృషభేంద్రుఁ డాయితంబై తనర్చె

(ప్రెగడగారి హరివంశము)