పుట:ఉదాహరణపద్యములు.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

20

తే. కన్నుగవకాటుకయుఁ బోడికచ్చడంబు
భూతి రుద్రాక్షమాల త్రిపుండ్రకములు
ధవళదంతవాటికాస్థాపుటములు
నంగవికృతియు సజ్జాతి భృంగిరిటికి.

తే. గజ్జపరిఁ ద్రొక్కిజూపెఁ బాగడవిధంబు
గీతమున కాడెఁజేసె సంకీర్తనంబు
పాడె సూదాదిగీతప్రబంధవితతి
భృంగి పంచాంగకంబైన పేరణమున.

నందికేశ్వరునికి—
మహాస్రగ్ధర. కనిరాబ్రహ్మాచ్యుతాదుల్ఘనకనకలతాగ్రంథిసంబంధిజూటా
వనిఖాలద్బాలచంద్రస్వయముపచయకృద్వర్ణప్రభాసం
జనిబాస్వద్ఫారభాగస్థలసితభరితస్థాసకశ్రీసమగ్రా
సనపద్ముం బుణ్యపద్ము న్జరణనతవిపన్నాశు నా నందికేశున్.

(వీరమాహేశ్వరాచారసంగ్రహము)



సీ. తుహినధాత్రీధరోత్తుంగగాత్రస్ఫూర్తిఁ
బరిపూర్ణచంద్రికాప్రభలు మాయ
కఠినబంధురతరస్కంథఘంటాధ్వని
నెదిగి దిశావలు లెదురుమ్రోయ
పవచండనిష్ఠురపటుపాదఖురహతిఁ
బరి వైరియై మహీభాగ మగల
వరభోగభోగీంద్రవాలవాతోద్ధతిఁ
జెదరి ధారధరశ్రేణు లవియ
గీ. వర్ణితాయతశృంగతీవ్రక్షతములఁ
బెల్లుకొని పద్మజాండంబు చిల్లులొలయఁ
జండగతివచ్చు గైలాసశైల మనఁగ
నెసగు పడివాగెతో వృషభేంద్రు డమరె.