పుట:ఉదాహరణపద్యములు.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

19

గీ. మొరదినెవ్వాడు ముప్పదిమూడుకోట్లు
వేలుపులుఁ బారఁబార వెన్వెంట దగిలె
నట్టి శ్రీవీరభద్రుఁ డీయద్రిమీఁద
భద్రకాళియుఁ దానుండు బద్మనయన

(శ్రీనాథుని కాశీఖండము)



సీ. శూలి కన్నులఁగెంపుఁ జూపినరౌద్రంబు
పొదల ముందరిదెసఁ బొడమినతని
భువనభయంకరస్ఫూర్తి బెంపెసలార
శరభావతారకం బరగినతని
జన్నంపు సిరికొన సాగజూచిన తాతఁ
జేకొని తలవంపు జేసినతనిఁ
దళదళమని మించు దుళగించు గైదువుల్
కరముల బదినూటఁ గలిగినతని
గీ. సురలు నసురలుఁ బలుమరుఁ జూచి బెదర
బిరుద పెండెంబు డాకాలఁ బెట్టినతని
భద్రకాళి మహాశక్తిఁ బరమభక్తిఁ
బాయకుండెడు శ్రీవీరభద్రుఁ దలఁతు.

(పోతరాజు వీరయ – త్రిపురవిజయము)



భృంగీశ్వరునికి—
శా. క్షామక్షాము...న్నికటప్రకటవక్షఃపీఠముం బాండుర
క్షామిశ్రావయవంబులైన వికటాకారంబులో నవ్వులై
చాముండాకరతాళకుట్టితలయస్థానంబుగా నుబ్బుతత్
హ్రీముద్రంబుగఁ బేరణీవిధమున న్నర్తించె మహాభృంగియున్.

(అనిరుద్ధచరిత్రము)