పుట:ఉదాహరణపద్యములు.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

18

గీ. సవడిమోములఁ జతురత సమకొనంగ
జోడుమాటలు సరివడ నాడునతఁడు
దంతిముఖు గూర్మితమ్ముఁడై తనరునతఁడు
కదలె బలముల నడిపింపఁ గ్రౌంచవైరి.

(వీరయ్య – త్రిపురవిజయము)



భైరవునికి—
మ. క్షయకాలంబున సింధుసాగరరసాస్వాదాతిరేకంబునన్
నయనాబ్జంబును ఘూర్ణితంబుగను సంధ్యాకాళరాత్రీకర
ద్వయతాళానుగతిప్రమోదమున మత్తల్లీమహానృత్తముల్
ప్రియ మొప్పారఁగఁ జేయు భైరవుఁడు గల్పించు న్మహైశ్వర్యముల్.

ఉ. వ్యాలవిభూషణాళియు దిగంబరమున్ గదయుం ద్రిశూలమున్
వ్రేలెడుగెంజెడల్ గగనవీథిఁకి జాఁగిన యుగ్రరూపు నా
భీలచతుర్భుజంబులు నభేద్యకరాసియుఁ జంద్రఖండమున్
ఫాలవిలోచనంబుగల భైరవు గాంచె విభుండు ముందఱన్.

(పోతరాజు – భేతాళపంచవింశతి)



వీరభద్రునికి—
సీ. ఎవ్వఁడుడాచేతి క్రొవ్వాడినఖములఁ
జిదిమె బాషాదేవి చిగురుముక్కు
కనకమేఖల గ్రుచ్చికట్టె నెవ్వఁడు లీల
బిరుదుమైఁ బూషార్కుమెఱుగు బండు
కొనరకెవ్వఁడు పదాంగుష్టభాగంబున
నుడురాజుపొట్ట గుజ్జురుకనూరె
తరిగె నెవ్వఁడు ఖడ్గధారాంచలంబున
నగ్ని నాలుకలేడు నంటదరిమి