పుట:ఉదాహరణపద్యములు.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

17

ఉ. అంకముఁజేరి శైలతనయాస్తనదుగ్ధములానువేళ బా
ల్యాంకవిచేష్టఁ దొండమున నవ్వలి చన్గబళింపఁబోయి యా
వంకఁగుచంబుగాన కహివల్లభహారము గాంచి వే మృణా
ళాంకురశంక నంటెడు గజాస్యుని గొల్తు నభీష్టసిద్ధికిన్.

(అల్లసాని పెద్దయ్య – మనుచరిత్రము)



కుమారస్వామికి—
చ. చనవున రెండువక్త్రములు చన్నులపా ల్గుడువంగ నొక్క మో
ము నగఁగ నొక్కయాననము ముద్దు నటింపఁగ నొక్క యాస్యము
న్గనఁగ నిదేమి పల్కదని యాలపనంబునఁ జెక్కులించు ను
బ్బున నగు షణ్ముఖుం డెలమిఁ బొంది త్రిశక్తులు మాకు నీవుతన్.

(విక్రమసేనము)



చ. తమకముతోడఁ దల్లియును దండ్రియు నొక్కట ముద్దు వేడ సం
భ్రమమున వచ్చి తల్లిముఖపద్మము తండ్రి మొగంబు లైదు వే
గమ తన యాఱుమోములను గైకొని ముద్దిడు మేటివేలుపుం
గొమరుఁడు నాదు వాణికి నకుంఠితశబ్దము లిచ్చుఁగావుతన్.

(విష్ణుకథానిధానము)



సీ. తలిదండ్రుల పొందు దప్పి యొండెడ నార్వు
రువిదల యేదువ నొదిగినతఁడు
కడువడి బలుగొండఁ గాఁడిపారినమేటి
ఘనసాయకము గేలగ్రాలునతఁడు
కమియాడగాఁ బాపకవణంబు దినియాడు
రెక్కలతురగంబు నెక్కినతఁడు
భోగిపాన్పున నిద్ర భోగించు దేవునిం
దరిమిన రక్కసు నురిచినతఁడు