పుట:ఉదాహరణపద్యములు.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

15

గీ. సకలతిథులం జతుర్దశి షష్ఠిఁ బౌర్ణ
మాశిఁ బంచమి మహనీయమహిమ నంబ
ధృవఁ దపస్విని సావిత్రి దృష్టిశాంతి
దేవమాత భక్తిప్రియఁ దలఁతు భక్తి.

అష్టాదశయోగవీరశక్తులకు—
సీ. లక్ష్మికొల్లాపురి లంకశాంకరి విశా
లాక్షి కాశికను వింధ్యమున దుర్గఁ
గన్యకన్యాకుబ్జఁ గామరూపంబునఁ
గామాక్షి కాంచిని గామకోటి
మండలిఁబుండ్రక మాణిక్యదత్తవా
టమున నార్యావర్తమునఁ ద్రిపుర
జ్వాలాధరంబున జ్వాల హేమచ్ఛత్ర
పురిమహాయోగ శ్రీగిరిని భ్రమర
గీ. విరజవిరజిహుంకృతిపీఠ సింహ
ళమున నరసింహికను గాశ్మీరమునవాణి
యుజ్జయిని మహంకాళిని యున్నతముగఁ
జూచువారలు జముపురిఁ జూడరెందు.

వినాయకునికి—
ఉ. అల్లన తొండమెత్తి శివునౌఁదల యేటిజలంబువుచ్చి సం
ఫుల్లతఁ బాదపీఠకము పొంతనయున్న సహస్రనేత్రుపై
జల్లి శివార్చనాకమలసంహతిఁ బ్రోక్షణసేయునట్లు శో
భిల్లు గజాననుండు మదభీప్సితసిద్ధికరుండు గావుతన్.

(విజయసేనము)



శా. గీర్వాణాచలసాను వాత్మరదన క్రీడాహతంబైన న
య్యుర్వీరంధ్రమునం దనంతఫణరత్నోద్యత్ప్రభల్ పర్వి