పుట:ఉదాహరణపద్యములు.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

14 అంబికాస్తుతి

సీ. కాశకర్పూరనీకాశఁగా భావింపఁ
గవితానిరూఢి ప్రఖ్యాతి నొసఁగు
యావకారుణదేహయష్టిఁగాఁ జింతింప
మదకుంభినీయాన మరులుగొలుపు
నీలజీమూతసన్నిభఁగా విలోకింప
సకలమాయాప్రపంచము నడంచుఁ
గనకచంపకదామగౌరిఁగా శీలింప
నంహస్సమూహంబు సంహరించు
గీ. శంభుదేవి విశాలాక్షి సదనుకంప
యోగిజనసేవ్య యోగపయోదశంప
శ్రీకరకటాక్ష లేశ రక్షితనిలింప
ముజ్జగంబుల మొలిపించు మూలదుంప.

(పిల్లలమఱ్ఱి వీరయ్య - పురుషార్థసుధానిధి)



ఉ. నందుని కూర్మినందన యనంగ యశోదకృశోదరంబు నిం
డందగ నావహించి ప్రకటంబుగ విష్ణునితోడఁబుట్టుఁవై
సుందరి గోకులైకనవశోభనయై జనియించి యే జగ
ద్వందిత యొప్పు నయ్యసురదారణి నాదిమశక్తిఁ గొల్చెదన్.

తే. తనువులం దెల్ల నెలసి చేతనయనంగఁ
బ్రజ్ఞయన మాయయనఁగ బూరణి యనంగఁ
పరయనఁఘ శాంతియననొప్పు హరపురంధ్రిఁ
బరమభద్ర దాక్షాయణిఁ బ్రస్తుతింతు.

సీ. చంద్రబింబానన చారునేత్రత్రయ
శోభిని సురముని స్తుత్యచరితఁ
గాళిఁగాత్యాయనిఁ గంసధిక్కారిణి
నహిత భయంకర నభయదాత్రి
బ్రహ్మవాదినిఁ గామపాలిని సిద్ధ సౌ
దామిని రేవతీతరుణి నచల
యోగ ప్రదాయిని యోగిని గంధర్వి
లక్ష్మి సరస్వతి లజ్జఁగీర్తి