పుట:ఉదాహరణపద్యములు.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

12 శివస్తుతి

ఉ. ఆడఁగ గెంజడల్ దొలకి యాడఁగ జాహ్నవి దిక్కులెల్ల న
ల్లాడఁగ భూతధాత్రి యసియాడఁగ దారము నాకసంబు నూ
టాడఁగ ముజ్జగంబుఁ గొనియాడఁగ నిచ్చట నీవు తాండవం
బాడఁగ గౌరి నిన్సరసమాడఁగ జేరునటే మహానటా.

శా. ఆడెం దాండవ మార్భటిన్ పటహలీలాటోప విస్ఫూర్తి సం
క్రీడాడంబర ముల్లసిల్ల గరళగ్రీవుండు జూటాటవీ
క్రోడాఘాటకరోటికోటరకుటూకోటీలుఠచ్ఛిందు వీ
చీడోలాపటలీపరిస్ఫుటతరస్ఫీతధ్వనిప్రౌఢిమన్.

(శ్రీనాథుని భీమఖండము 4.148)



సీ. కపిలజటాజూట గంగాసముత్తుంగ
వీచీఘటలు మిన్ను వీఁకదాఁకఁ
బ్రబల బాహార్గళ పరికంపితస్ఫార
ఢక్కాధ్వనిని దిశల్ పిక్కటిల్ల
జ్వాలాకరాళ భీషణ శారదస్థూల
శూల యుద్ధప్రభల్ సూర్యుఁ బొదువఁ
బ్రకట బంధుర దీర్ఘ పటువజ్ర నిష్ఠుర
పదఘట్టనము లుర్వి యదలనొదవ
గీ. విమల శార్దూల చర్మాంచలములు దూల
మహిత మండన ఫణిఫణామణులు గ్రాల
నసమ రౌద్ర రసావేశ మావహింప
నారభటి భూరితాండవం బాచరించె.

(పోతరాజు వీరయ – త్రిపురవిజయము)