పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/367

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉ. [అప్పు][1]డు తోడనాడు చెలులందఱు నాత్మలఁ జాలఁ గుందుచుం
జొప్పఱి శారదార్కరుచి సోఁకున గ్రుస్సిన యేరుఁ బోని యా
కప్పురగంధిఁ జూచి గజగామిని చందము నేఁడు రాజుతోఁ
జె[(ప్పు)దమంచుఁ[2] (బూని)][3] సరసీరుహనాభ నసంభ్రమంబునన్. 43

వ. ఒండొరులం గడవం బరతెంచి తద్వృత్తాంతం బంతయు నమ్మహీకాంతునకుం జెప్పిన నతండును నమ్మత్తకాశిని చిత్తంబు [భవదాయత్తం][4] బగుట యెఱింగి కురురాజువలని నెయ్యంబునం జేసి యుల్లంబునఁ జిడుముడి వడుచుఁ జెల్లెలికడ కేతెంచి సుందరంబగు మందిరారామసీమంబున మాధవీలతామంటపంబున విరహవేదనాదూయమాన యగుచు విన్ననై యున్న కృశోదరిం జూచి నాసాగ్రంబున తర్జనిని మోపి యలంతినవ్వుతోఁ దలయూపుచు నిట్లనియె. 44

శా. పాపా చూడవొ యేమి చిత్రఫలకం(?) బాటించి నే వ్రాయు ధా
త్రీపాల[గ్రణులన్ మ][5]హామహుల సందీప్తప్రతాపాఢ్యులం
జాపల్యంబున వారి డించి మగధక్ష్మాభర్తకై వార్థిలోఁ
గాపున్నట్టి మురారియే ఘనుఁడు గాఁగాఁ గోరితే యాత్మలోన్. 45

గీ. అబల నాబుద్ధిఁ జేసి యయ్యదునృపాలు
మీఁద నొల్లమి వాటించు మేటి నృపతిఁ
గోరు మొక్కనిఁ గలకంఠి కోరునమ్మ
యవని నెలమావి యుండఁగ నన్యశాఖి. 47

క. అలి పలుకు నన్న వాక్యము
వినివినముగఁ జేసి దాని వెడలఁగ నొత్తెన్
వనజాక్షి మనసులోపల

వనధి పయోవీచి క్షుద్రవస్తువుఁ బోలెన్. 48

  1. ప్ర.పూరణము
  2. హమంచు (సా.ప.)
  3. ప్ర.పూరణము
  4. ప్ర.పూరణము
  5. ప్ర.పూరణము