పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/368

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉ. ఆ నయశాలి విందుఁడు ప్రియానుజ బావ మెఱుంగఁ గోరువాఁ
డై నలినాయతేక్షణ సభాసదనంబున కేఁగుదెంచి నా
నా నరపాలనందనుల నవ్యవయోగుణరూపధన్యులం
దే నియమించెఁ గాలరుల దిక్కుల కన్నిటికి న్ముదంబునన్. 49

గీ. అట్లు ప్రతికూలుఁడై యున్న యన్నఁ దలఁచి
నెరయ దూరంబు నందున్న నిన్నుఁ దలఁచి
యధికవాతూలహతిఁ గంప మడరు నట్టి
కడలియును బోలె కలకంఠి కడు వణంకు. 50

ఉ. కావున నోమురాంతక యఖండదయావిభవం బెలర్ప రా
జీవదళాక్షి నయ్యబల శీఘ్రమ యుద్వహ[నమ్ము][1] గమ్ము క్రో
ధావిలవైరిలోకమకరాలయముం బటుబాహుమందర
గ్రావముచే మదించి కుతుకంబున రెండవలక్ష్మి కైవడిన్. 51

మత్తకోకిల. వారిజేక్షణ పంపుమా వరవర్ణినిం బరిచారి మం
దారమాలిక నర్మవేదిని యవ్విలాసిని పాలికిన్
నీరజానన [నీరదావృతి నింగి][2] నేరి కదృశ్యయై
బోరునం జనివచ్చుఁ గ్రమ్మఱఁ బూని నీకడ కర్థిమైన్. 56

ఉ. ఇప్పుడు వార్ధివేష్టిత మహింగల రాజులు వచ్చియున్న వా
రిప్పుడు సాఁగుచున్న యది యింపెసలారఁ[గ నీ][3] స్వయంవరం
బిప్పుడ వచ్చి శౌరి నిను నంబరవీథులఁ గొంచు నేఁగు నం
చిప్పువుఁబోఁడి యక్కువయేక్షణతో నెఱిఁగించు టొప్పగున్. 57

క. అని చెప్పి మునివరేణ్యుఁడు
వినువీథిని శారదాభ్రవిభ్రమ[లీలన్
జన ని][4]oతి కడకు ఖగవా

హనుఁడును మందారమాలికాంగనఁ బనిచెన్. 58

  1. ప్రా.పూరణము
  2. ప్రా.పూరణము
  3. ప్రా.పూరణము
  4. ప్రా.పూరణము