పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/366

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉ. ఏమని చెప్పు[దున్ యదుకు][1]లేశ్వర తత్తనుతాపగౌరవం
బా మృగరాజమధ్య తనుయష్టి నలందిన చందనంబు లీ
లామృగనాభిలేపనవిలాసము గైకొన హారమౌక్తిక
స్తోమ మురోజపాలిపయిఁ దూకొనె నీలమణి[ద్యుతిం గొనన్][2]. 33

గీ. చెప్పఁ జిత్రంబు వినుము రాజీవనయన
సుదతి తనుతాపమున వ్రేళ్ళు చురుకు మనిన
నులికిపడ సారె మహ్హన నూఁదుకొనుచు
సఖు లలందు[దు][3] రతివ మైఁ జందనంబు. 34

చ. వెనుఁబడ దించుకైన వెనువెంటనె వచ్చు జగంబు నిందకున్
వినదు సఖీజనంబు పదివేలవిధంబుల బుద్ధి చెప్పినన్
వనరుహనేత్రి నీకడకు వచ్చు తలంపులె చేయుచుండు నె
మ్మనమున రేలునుం బగలు మాధవ నీపయిఁబ్రేమ యెట్టిదో. 37

క. స్ఫురితాధర మాకంపిత
కర ముద్గతబాష్ప ముదితఘర్మ ముదంచత్
పరిధానంబై మానస
సురతశతం బరిగె రాజసూతికి నీతోన్. 39

గీ. గోరు చోఁకని[4] పరిరంభకోటితోడ
పల్లు చోఁ కని[5] చుంబనప్రతతితోడ
నాథుచోఁ కని సంభాషణములతోడ
రమణి యోలాడె మానసరతి పయోధి. 40

మ. కలకంఠీమృదుకంఠరావముల [కా][6]కంపించు భృంగాంగనా
కలగానంబుల కుమ్మలించు నవమాకందీలతాపుంజ వీ
థులకుం బోవఁగ నోడుఁజుడ [భయ][7]మందుం బూర్ణిమాచంద్రునిన్

జలతాతేక్షణ యవ్విలాసిని మనోజాతాగ్ని సంతప్త యై. 41

  1. ప్రా.పూరణము
  2. ప్రా.పూరణము
  3. ప్రా.పూరణము
  4. బోకని (సా.ప.)
  5. బోకని (సా.ప.)
  6. ప్రా.పూరణము
  7. ప్రా.పూరణము